క్రికెటర్లు అందరూ కుక్కల్లా ఒకేలా మొరుగుతున్నారేంటి : కంగానా రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగానా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా ద్వారా తన మనసులోని మాటలను ఏ మాత్రం ఆలోచించకుండా నిస్సంకోచంగా ట్వీట్ చేస్తూ తెలియజేస్తుంటారు.

 Kangana Ranaut Comment On Rohit Sharma Tweet On Farmers Protest And Deleted Late-TeluguStop.com

ఈ విధంగా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ కంగన ఎప్పుడు వివాదం సృష్టిస్తారు.తాజాగా అమెరికా పాప్ సింగర్ రిహానాను ‘పోర్న్ సింగర్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్… తాజాగా క్రికెటర్లపై కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో క్రికెట్ అభిమానులు కంగనాను సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రహానే, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు ప్రస్తుతం ఆందోళన చేపడుతున్న రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ రైతులు దేశానికి ఎంతో అవసరమని, త్వరలోనే ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంటుంది అంటూ ట్వీట్లు చేశారు.ఈ సందర్భంగానే రోహిత్ శర్మ రైతులను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ “మన అందరం కలిసికట్టుగా ఉంటే ఇండియా ఎప్పుడు దృఢమైనదే.

సరైన పరిష్కారం వచ్చే వరకు వేచి చూద్దాం మన దేశాన్ని సమృద్ధిగా చేయడంలో రైతులు పాత్ర ఎంతో కీలకం అందరూ కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొంటారు” అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశారు.

Telugu Angry, Cricket Fans, Farmers, Kangana Ranaut, Rohit Sharma, India, Trolls

రోహిత్ శర్మ ట్వీట్ కి స్పందించిన కంగనా.క్రికెటర్లు ఎందుకని కుక్కల ఒకేలా మొరుగుతున్నారు.రైతుల సంక్షేమం కోసం ఓ విప్లవంలా తయారు చేసిన చట్టానికి రైతులు ఎందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.

ఇక్కడ ఉద్యమం చేస్తున్న వారందరూ రైతులు కాదు.వారు టెర్రరిస్టులు అంటూ ఇది చెప్పడానికి క్రికెటర్ లందరూ ఎందుకు భయపడుతున్నారు అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ విధంగా కంగనా ట్వీట్ పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేయడంతో కాసేపటి తర్వాత కంగనా తను పెట్టిన ట్వీట్ డిలీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube