కంగనా రనౌత్ బాడీ గార్డ్ అలాంటి పని చేసి బుక్ అయ్యాడు

సెలబ్రిటీలకి అంగరక్షకులుగా ఉన్నవారు గాని లేదంటే పర్శనల్ అసిస్టెంట్ గా ఉన్నవాళ్ళు పొరపాటు చేసిన వారిని హైలైట్ చేయడానికి మీడియాలో ఎక్కువగా ఆయా సెలబ్రిటీల పేర్లు ఉపయోగిస్తూ ఉంటుంది.వాళ్ళు చేసే పనుల కారణంగా సెలబ్రిటీలో ఒక్కోసారి తమ ఇమేజ్ కోల్పోవాల్సి వస్తుంది.

 Kangana Ranaut Bodyguard Rape Allegations, Bollywood, Mumbai, Bangalore, Tollywo-TeluguStop.com

ఇప్పుడు కంగనా రనౌత్ విషయంలో కూడా అలాగే జరిగింది.ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కంగనా ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే.

ఎదుటి వారు ఎంత పెద్ధవారైన నిర్మొహమాటంగా తన మాటలతో దాడి చేస్తుంది.ఈ నేపధ్యంలో కంగనా మాటలకి భయపడి చాలా మంది సెలబ్రిటీలు సైలెంట్ యిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా కంగనా ర‌నౌత్ వ్యక్తిగత బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు న‌మోదైంది.

ముంబ‌యికి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ త‌న‌పై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడ‌ని ఫిర్యాదు చేసింది.

ముంబ‌యిలోని డీఎన్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది.న‌టి కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్ కుమార్ తనని వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేయ‌డంతో పాటు త‌న నుంచి 50 వేలు తీసుకున్నాడ‌ని పేర్కొంది.

ఎనిమిదేళ్ళ క్రితం తమకి ప‌రిచయం ఏర్పడిందని, గ‌తేడాది జూన్‌లో వివాహం చేసుకుంటాన‌ని ప్రపోజ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.తను ఒకే చెప్పడంతో తరుచుగా త‌న ఫ్లాట్‌కు వ‌చ్చిన కుమార్ త‌న‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోప‌ణ‌లు చేసింది.

ఏప్రిల్ 27న వ్యక్తిగత అవసరాల కోసం తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని పేర్కొంది.ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే మొహం చాటేస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది.మరి వ్యక్తిగత బాడీ గార్డ్ చర్యలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube