మరోసారి బాలీవుడ్ మీద పడ్డ కంగనా  

Kangana Ranaut asks India to \'reject Bollywood, Tollywood, Indian Cinema, Drugs Probe, Nepotism, Kollywood - Telugu @kanganateam, Bollywood, Drugs Probe, Indian Cinema, Kangana Ranaut, Kollywood, Nepotism, Tollywood

బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, బాలీవుడ్ లో సెలబ్రెటీ ప్రముఖుల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది.కొంత మంది ప్రముఖులని లక్ష్యంగా చేసుకొని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

TeluguStop.com - Kangana Ranaut Asks India To Reject Bollywood

ఆరంభంలో లైంగిక వేధింపులు, తరువాత సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో నెపోటిజం, డ్రగ్స్ కల్చర్ వంటి అంశాలని తీసుకొని సెలబ్రెటీ కుటుంబాలని, డ్రగ్స్ కి అలవాటైన వారిని టార్గెట్ చేస్తుంది.ఆమె నోటికి ఏ ఒక్కరు తాళం వేయలేకపోతున్నారు.

దీంతో కంగనా ఎన్ని విమర్శలు చేసిన బాలీవుడ్ లో ఆమె ఆరోపణలు చేస్తున్న వారి నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది.ఆమె నోట్లో నోరు పెట్టి మళ్ళీ తిట్టించుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోతున్నారు.

TeluguStop.com - మరోసారి బాలీవుడ్ మీద పడ్డ కంగనా-Bollywood News-Telugu Tollywood Photo Image

అయితే కంగనా మాత్రం తన విమర్శల విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు.ప్రతి సారి ఏదో ఒక సందర్భాన్ని తీసుకొస్తూ బాలీవుడ్ ప్రముఖులని టార్గెట్ చేస్తూనే ఉంది.

ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ మీదనే ఆమె హాట్ కామెంట్స్ చేసింది.

మన దేశంలో కళాకారులున్నారు, బఫూన్లు ఉన్నారు, భారత చిత్ర పరిశ్రమ ఉంది, బాలీవుడ్ కూడా ఉంది.

బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదాన్ని హాలీవుడ్ నుంచి కాపీ చేశారు.అక్కడి నుంచి దొంగిలించారు.ఈ అవమానకరమైన పదాన్ని దయచేసి తిరస్కరించండి అని ట్వీట్ చేసింది.అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనేది కొంత మంది వాదన.

కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిచ్చు పెట్టడం ద్వారా, అలాగే ముంబైకి బాలీవుడ్ ని దూరం చేయడం ద్వారా కంగనా పంతం నెగ్గించుకోవాలని చూస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎన్ని వినిపించిన కంగనా మాత్రం తాను ఎం చేయాలని అనుకుంటే అది చేస్తుంది.

#Drugs Probe #Kangana Ranaut #Nepotism #@KanganaTeam #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Asks India To Reject Bollywood Related Telugu News,Photos/Pics,Images..