నష్టపరిహారం కోరుతూ బీఎంసీ కి కంగనా నోటీసులు… ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా!  

Kangana Ranaut Asks For Rs. 2 Crores Compensation From BMC From Damages, Kanagan Ranauth, Siva Sena, Mumbai, Bandra Kangana Office, BMC Officers, Highcourt, Himachal Pradesh - Telugu @kanganateam, Bandra Kangana Office, Bmc Officers, Highcourt, Himachal Pradesh, Kanagan Ranauth, Mumbai, Siva Sena

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు సంబందించిన ఆఫీస్ ను ఇటీవల బీఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.అయితే ఆ సమయంలోనే కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొని ప్రోపర్టీ ని పూర్తిగా కూల్చనీయకుండా అడ్డుకోగలిగింది.

 Kangana Ranaut Asks For Rs 2 Crores Compensation From Bmc From Damages

అయితే అప్పటికే కొంత మేరకు ఆస్థి నష్టం వాటిల్లడం తో తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు కంగనా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.బాంద్రా లోని తన ఆఫీస్ ను కూల్చినందుకు రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అంటూ బీఎంసీ కి నోటీసులు జారీ చేసింది.బాంద్రా లోని కంగనా ఆఫీస్ చట్టవిరుద్ధంగా నిర్మించిన కట్టడం అని, కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు సెప్టెంబర్ 8 న కంగనా కు నోటీసులు జారీ చేసింది.

అయితే నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలి అంటూ నోటీసుల్లో పేర్కొనగా, ఆమె ఈ విషయం పై హైకోర్టు లో పిటీషన్ వేసి కూల్చివేతను ఆపివేయాలి అంటూ కోరింది.అయితే కోర్టు విచారణ జరుగుతుండగానే బీఎంసీ అధికారులు కంగనా ఆఫీస్ కూల్చివేతకు పూనుకున్నారు.

నష్టపరిహారం కోరుతూ బీఎంసీ కి కంగనా నోటీసులు… ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబై తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి.అయితే కోర్టులో పిటీషన్ విచారణ జరుగుతుండగానే బీఎంసీ అధికారులు వ్యవహరించిన తీరుపై కంగనా సోషల్ మీడియా సాక్షిగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అందుకే ముంబై నగరం మరో పీవోకే గా మారిపోయింది అంటూ మరోసారి ట్వీట్ చేసింది.అయితే ఇప్పుడు తాజాగా తనకు జరిగిన నష్ఠానికి రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అంటూ కంగనా బీఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.అయితే దీనిపై బీఎంసీ స్పందించాల్సి ఉండగా,మరోపక్క కంగనా ఆఫీస్ కూల్చివేతపై బీఎంసీ అధికారులు వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

#BandraKangana #Kanagan Ranauth #Siva Sena #Mumbai #BMC Officers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Asks For Rs 2 Crores Compensation From Bmc From Damages Related Telugu News,Photos/Pics,Images..