కంగనా ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసిన ట్విట్టర్..!

కంగనా.ఈ పేరు తెలియనివారు బహుశా ఉండరేమో.

 Kangana Permanently Removed From Twitter-TeluguStop.com

బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తనకు సంభంధం లేని విషయాల్లో కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వివాదాలు చెలరేగేలా మాట్లాడడం ఈ బ్యూటీ స్టైల్.

అందుకే బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది.

 Kangana Permanently Removed From Twitter-కంగనా ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసిన ట్విట్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కంగనా ధాటికి పెద్ద పెద్ద హీరోలు కూడా కామ్ అయినా సందర్భాలు ఉన్నాయి.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.తన సినిమాల విషయంలో కూడా అలాగే స్పందిస్తూ వివాదాలు చెలరేగేలా చేసి ఫ్రీ ప్రమోషన్స్ చేసుకోవడం ఈమె స్పెషాలిటీ.

ఈమె నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరస హిట్లతో దూసుకు పోతుంది.

అయితే తాజాగా కంగనా రనౌత్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది.

ఈమె ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించినందుకు ఈమె ఖాతాను సస్పెండ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించడంతో కంగనాకు షాక్ తగిలిందని చెప్పాలి.

కంగనా అకౌంట్ ఇంతకు ముందు కూడా ఇలానే నియమాలు ఉల్లంఘించినందుకు ఖాతాను క్లోజ్ చేసింది.

తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా కంగనా వరస ట్వీట్స్ చేసింది.

ట్విట్టర్ వేదికగా ఆమె పదే పదే నియమాలు ఉల్లంఘించినట్లు తేలినందుకు అకౌంట్ శాశ్వతంగా క్లోజ్ చేశామని ట్విట్టర్ తెలిపింది.దుర్వినియోగపరిచే ప్రవర్తన, ద్వేషపూరిత ప్రవర్తన మేము సహించం అని ఒక ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.

అందరికి ఒకే విధమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన తెలిపారు.

Telugu Kangana Permanently Removed From Twitter, Kangana Ranaut, Permanently Suspended, Thalaivi, Twitter Account-Movie

ఈ విషయం పై కంగనా స్పందిస్తూ.నా ఖాతా నా వర్చువల్ ఐడెంటిటీ ఎప్పుడూ దేశం కోసం అమరవీరులవుతాయి అంటూ ట్వీట్ చేసి ఆ ట్వీట్ కు ట్విట్టర్ సి ఈ ఓ జాక్ డోర్సీ ని ట్యాగ్ చేసారు.ఇది ఇలా ఉండగా కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్ గా రూపొందుతున్న తలైవి సినిమా చేస్తుంది.

ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా విడుదలకు సిద్దమైన కరోనా కారణంగా వాయిదా పడింది.

#Thalaivi #Kangana Ranaut #Twitter Account

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు