తలైవి నుంచి మరో లుక్,అదరగొడుతున్న కంగనా

క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగి ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టి తమిళ ప్రజల గుండెల్లో ఒక అమ్మ గా నిలిచిన తలైవి జయలలిత.ఆమె జీవిత కధ ఆధారంగా చాలా బయోపిక్ లు తయారు అవుతున్నాయి.

 Kangana One More Look Release From Thalaivi-TeluguStop.com

వాటిలో ముఖ్యంగా బాలీవుడ్ నటి కంగనా రౌనత్ నటిస్తున్న ‘తలైవి’ మూడు భాషల్లో తెరకెక్కుతుంది.ఈ చిత్రం కోసం కంగనా భారీ గా తనలో మార్పులు తీసుకువచ్చి మరీ ఈ చిత్రం లో నటిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించి కంగనా రెండు లుక్స్ రిలీజ్ కాగా మంచి స్పందన లభించింది కూడా.అయితే ఇప్పుడు తాజాగా కంగనా మరో లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ లుక్ లో జయలలిత యంగ్ ఏజ్ లో ఎలా ఉంది అన్న దానికి సంబంధించి కంగనా లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం తో ఈ లుక్ లో కూడా కంగనా అదరగొట్టింది అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.జయలలిత 72 వ జయంతి సందర్భంగా ఈ లుక్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ సినిమా లో శోభన్ బాబు పాత్ర కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది.జయలలిత,శోభన్ బాబు ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఒక టాక్ ఉన్న విషయం తెలిసిందే.

అందుకే ఈ తలైవి చిత్రంలో శోభన్ బాబు క్యారెక్టర్ కూడా ఉండనుందని, ఈ క్యారెక్టర్ కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల టాలీవుడ్ లో విడుదల అయిన నాగశౌర్య చిత్రం అశ్వద్ధామ లో జిషు సేన్ విలన్ పాత్రలో అందరి మన్ననలు పొందాడు.

ఇప్పుడు తలైవి లో శోభన్ బాబు క్యారెక్టర్ లో ఎలా కనిపించబోతున్నాడు అన్న వివరాలు తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.తెలుగు,తమిళ,హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube