మౌనంగా ఉంటే ఆమె మరింత రెచ్చి పోతుంది  

Kangana Once again Comments On Urmila Kanagana Ranauth, Urmila, BJP, Maharastra, Karan Johar, Mahesh Bhatt, - Telugu @kanganateam, Bjp, Kanagana Ranauth, Karan Johar, Maharastra, Mahesh Bhatt, Urmila

బాలీవుడ్‌ ప్రముఖులపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలు మరీ శృతిమించుతున్నాయి.ఇన్నాళ్లు ఆమెకు మద్దతు పలికిన వారు ఆమె ఖచ్చితత్వంతో మాట్లాడుతుంది అన్న వారు కూడా ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు కాస్త తగ్గితే బాగుంటుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

TeluguStop.com - Kangana Once Again Comments On Urmila

ఈ విషయంలో ఆమె తీరు మారకుంటే బాలీవుడ్‌ నుండి ఆమెను అనధికారికంగా బహిష్కరించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఆమె బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుందనే విమర్శలు ఎదుర్కొంటుంది.

ఆమెకు సంబంధించినంత వరకు ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది.కాని అది ఎంతో మంది ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని ఆమె గుర్తించలేక పోతుంది.

TeluguStop.com - మౌనంగా ఉంటే ఆమె మరింత రెచ్చి పోతుంది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇటీవల టాలీవుడ్‌ ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ లెజెండ్రీ హీరోయిన్‌ ఊర్మిలను కంగనా పోర్న్‌ స్టార్‌ అంటూ కామెంట్స్‌ చేసింది.బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నావా.

అందుకు ఇంతగా ఎందుకు డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి వెళ్తే సరిపోతుంది కదా అంటూ ఊర్మిల కామెంట్స్‌ చేయగా అందుకు కంగనా ఇచ్చిన సమాధానం మరీ దారుణంగా ఉంది. పోర్న్‌ స్టార్స్‌ కు సీట్లు వస్తున్నప్పుడు నాకు సీటు రాదా అంటూ కామెంట్‌ చేసింది.

నేను మహారాష్ట్ర గౌరవ మర్యాదలు పెంచేలా వ్యవహరిస్తాను.ఎప్పుడు కూడా నేను ఒకరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడాలి అనుకోను.

కాని నన్ను విమర్శించే హక్కు అవతలి వారికి లేకుండానే నన్ను విమర్శిస్తే మాత్రం ఊరుకోను అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఎవరు ఈమెకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై రెచ్చి పోవడం కామన్‌ అయ్యింది.గత కొంత కాలంగా మీడియాలో కంగనా ఇష్యూ వైరల్‌ అవుతూనే ఉంది.అయితే సుశాంత్‌ మృతి చెందిన తర్వాత విషయం మరింత సీరియస్‌ అయ్యింది.

ఎవరిపై పడితే వారిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కంగనాకు అలవాటుగా మారిపోయింది.ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ మహేష్‌ భట్‌లను టార్గెట్‌ చేసి విమర్శలు చేసిన ఈమె ఇప్పుడు మొత్తం బాలీవుడ్‌ అంతా కూడా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా ప్రచారం చేస్తోంది.

గతంలో తాను కూడా తీసుకున్నాను.నాతో బలవంతంగా డ్రగ్స్‌ తాగించారు అంటూ కంగనా బాలీవుడ్‌ పై ఆరోపణలు గుప్పించింది.

మౌనంగా ఉంటే మరింతగా రెచ్చి పోతుంది కనుక ఈమెకు తగిన సమాధానం చెప్పాల్సిందే అని కొందరు భావిస్తున్నారట.

#Karan Johar #Maharastra #@KanganaTeam #Mahesh Bhatt #Urmila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Once Again Comments On Urmila Related Telugu News,Photos/Pics,Images..