ఫ్రీగా ఫుడ్ దొరుకుతుందని ప్రెస్ మీట్స్ కి వస్తారు... జర్నలిస్ట్ లపై కంగనా సంచలన వాఖ్యలు  

జర్నలిస్ట్ ల మీద మరోసారి నోరు పారేసుకున్న కంగనా రనౌత్. .

Kangana Once Again Bold Comments On Journalists-

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్.అదే సమయంలో బాలీవుడ్ లో ఎప్పుడు వివాదాలకి కేంద్ర బిందువుగా ఉంటూ సంచలన వాఖ్యలతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే కంగనా అంటే బాలీవుడ్ లో చాలా మందికి వణుకు.కాని ఆమెలో ప్రపంచంలోనే అత్యుత్తమ నటి ఉంది..

Kangana Once Again Bold Comments On Journalists--Kangana Once Again Bold Comments On Journalists-

ఈ కారణంగా చాలా మంది దర్శక నిర్మాతలు కంగనాతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.బాలీవుడ్ లో దర్శకులు, నిర్మాతలు, హీరోలు అని వదలకుండా అందరి మీద వాఖ్యలు చేసిన కంగనా అవకాశాలు రాకుండా ఎవరు ఆపలేకపోయారు.ఆమె తన హవా సాగిస్తూనే, మరోవైపు వివాదాలతో సహవాసం చేస్తూ ఉంది.

తాజాగా ఓ ఈవెంట్ లో మీడియాతో కాంగనా దురుసుగా ప్రవర్తించింది.ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అంతెత్తున లేచింది.దీనిపై జర్నలిస్ట్ సంఘాలు ఆమె మీద గుర్రుగా ఉన్నాయి.

కంగనా జర్నలిస్ట్ లకి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో మరోసారి మీడియా జర్నలిస్ట్ మీద ఆమె ఓ వీడియో పోస్ట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంది.జర్నలిస్ట్ ల ముసుగులో ఎక్కువ మంది దేశ ద్రోహులు ఉన్నారాని, వారు జాతి సమగ్రతని దెబ్బ తీసే విధంగా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారాని విమర్శించింది.

మీడియా తనని బ్యాన్ చేస్తా అని బెదిరిస్తున్నారని, దయచేసి ఆ పని చేయాలని అంటూనే, 50 రూపాయిల ఇస్తే ఏం రాయమంటే అది రాసే మీకు మాట్లాడే అర్హత లేదని తీవ్ర వాఖ్యలు చేసింది.చాలా మంది జర్నలిస్ట్ లు కేవలం ఫ్రీగా ఫుడ్ దొరుకుతుందని ప్రెస్ మీట్ లకి వస్తారని అలాంటి వారిని జర్నలిస్ట్ లు అని చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది అంటూ దారుణమైన వాఖ్యలు చేసింది.ఇప్పుడు కంగనా తాజా వాఖ్యలతో ఆమె మీద జర్నలిస్ట్ సంఘాలు మరింత సీరియస్ గా ఉన్నాయి.మరి ఆమె వాఖ్యలపై మీడియా జర్నలిస్ట్ లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.