తమిళ భాష నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న తలైవీ  

Kangana Learning Tamil For Talaivi Movie-kangana

ఇటీవల నటీనటులు ఏదైనా పాత్రలో నటించడం కంటే కూడా జీవించడమే ఎక్కువగా ఉంటుంది.ఇక సూపర్ స్టార్ అయితే మరి చెప్పనక్కర లేదు.సహజత్వం కోసం ఎన్ని తిప్పలు పడాలో అన్ని తిప్పలు పడుతూ ఆ క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Kangana Learning Tamil For Talaivi Movie-kangana Telugu Tollywood Movie Cinema Film Latest News Kangana Learning Tamil For Talaivi Movie-kangana-Kangana Learning Tamil For Talaivi Movie-Kangana

అలాంటి వారిలో ముందుగా చెప్పుకొనే నటి కంగనా రౌనత్.ఈమె ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం కోసం కంగనా ఇప్పటికే భారీ గా బరువు పెరుగుతుంది అని సమాచారం.

అయితే ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ తమిళం నేర్చుకోవడం కోసం నా నా తిప్పలు పడుతుందట.పాత్రలో సహజత్వం కనిపించడం కోసం కంగనా చేస్తున్న ప్రయత్నాలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

త‌మిళం నేర్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మైన‌ప్ప‌టికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను.డైలాగులు చిత్రంలో కీల‌కం కానుండ‌గా, ప‌లు డైలాగుల‌ని కంఠ‌స్తం చేస్తున్నాను.ఎప్ప‌టి నుండో త‌మిళం నేర్చుకోవాల‌ని అనుకున్నాను.

ఈ చిత్రం ద్వారా అది నెర‌వేరింది అని కంగ‌నా తాజాగా పేర్కొంది.

ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోను విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ స్వామి క‌నిపించ‌నున్నట్లు సమాచారం.మొత్తానికి భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరి ఈ బయోపిక్ ఎంతవరకు అలరిస్తుందో అన్నది తెలియాలి అంటే కొద్దీ కాలం ఆగాల్సిందే.