ట్విట్టర్ సీఈఓపై కంగనా ట్వీట్.. నేనంటే అతనికి భయమే

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని ముక్కుసూటి అమ్మాయిగా అభిమానుల మనసులో నిలిచింది.తాను నటన పట్ల ఎంతో ఆసక్తి చూపించడమే కాకుండా సోషల్ మీడియా కూడా అంతే ఆసక్తి చూపుతుంది.

 Kangana Interesting Tweet On Twitter Ceo-TeluguStop.com

ఇక ఈమె నటించిన సినిమాలలో ఆమె నటన కూడా ఉత్తమనటి అవార్డులను సొంతం చేసుకుంది.ఇక కంగనా ట్విట్టర్ ఖాతాలో ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో రకాల కౌంటర్లు ఇస్తుంది.

ఇప్పటికే కంగనాకు ట్విట్టర్ ఖాతా పై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నా సంగతి తెలిసిందే.ఎన్నో వివాదాలతో ప్రతిరోజు హాట్ టాపిక్ గా మారుతుంది కంగనా.అటు సినీ రంగంలో, ఇటు వాదనలలో సరి సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కంగనాకు సోషల్ మీడియా పట్ల ఎక్కువ వివాదాలు ఎదురవుతున్నాయి.

 Kangana Interesting Tweet On Twitter Ceo-ట్విట్టర్ సీఈఓపై కంగనా ట్వీట్.. నేనంటే అతనికి భయమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bollywood, Hruthik Roshan, Kanganga, Twitter-Movie

ఇప్పటికే హృతిక్ రోషన్ తో జరుగుతున్న వివాదం తో కోర్టు వాదనలు ఉండగా తాజాగా మరో వివాదంతో ముందుకు వచ్చింది.ఆమె ట్విట్టర్ ను టార్గెట్ చేస్తూ తను చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.ట్విట్టర్ లో ట్వీట్ లతో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది కంగనా.

దీంతో ఆమె ట్వీట్ లను తట్టుకోలేక ట్విట్టర్ ఇండియా ఆమెను షాడో బ్యాన్ చేసింది.దీంతో కంగనా ఆగ్రహానికి గురి కాగా నేరుగా ట్విట్టర్ సీఈఓ పై ఆసక్తికర ట్వీట్ లు చేసింది.

ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని జాక్ చాచా అని సంబోధిస్తూ భావ వ్యక్తీకరణ చేసినందుకు తన ఖాతాను జాక్ అండ్ అతని బృందం షాడో బ్యాన్ చేశారని తెలిపింది.అంతే కాకుండా వారు తనను చూసి భయపడుతున్నారని, అందుకే తనని బ్యాన్ చేయలేరంట‌ూ, అలాగని తనను ఉంచడానికి అనుమతించలేరని తెలిపింది.

కానీ ఆమె తన ఫాలోవర్స్ ని పెంచుకోవడానికొ లేదా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికొ అక్కడ లేను అంటూ, తను ఏది మాట్లాడినా అది దేశం కోసమేనని, దాన్ని వీళ్లంతా సహించలేక పోతున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపింది

#Twitter #Hruthik Roshan #Kanganga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు