అమీర్ ఖానే సామ్ చైతూ విడాకులకు కారణం.. కంగనా షాకింగ్ కామెంట్స్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, కాంట్రవర్సి క్వీన్ గా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగనారనౌత్ ఏ విషయం గురించి మాట్లాడినా అది సెన్సేషనల్ అవుతుంది.నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ట్వీట్ చేస్తూ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

 Kangana Fires On Amir Khan For Samantha Naga Chaitanya Divorce Issue,  Aamir Kha-TeluguStop.com

ఈ క్రమంలోనే కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా మరోసారి రెచ్చిపోయారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ కపుల్ కపుల్ పేరు పొందిన సమంత నాగ చైతన్య విడిపోవడం గురించి బాలీవుడ్ కంగనారనౌత్ స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

ఎంతో అన్యోన్యంగా ఉన్న సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం అమీర్ ఖాన్ అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే ఈమె స్పందిస్తూ… తాజాగా తన భార్యకు విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి తిరిగిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు తెలిపారు.

ఆ బాలీవుడ్ స్టార్ కు బిటౌన్లో విడాకుల స్పెషలిస్ట్ గా పేరు ఉందని ఆయన ఎంతో మంది మహిళల అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ పరోక్షంగా అమీర్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

గత పది సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న ఈ సౌత్ హీరో గత నాలుగు సంవత్సరాలుగా వైవాహిక జీవితంలో ఉంటూ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ ని కలిసిన వెంటనే తన సలహాలు సూచనల మేరకే తన భార్యకు విడాకులు ఇచ్చారని కంగనారనౌత్ అమీర్ ఖాన్ గురించి తెలియజేశారు.

Telugu Aamir Khan, Amirkhan, Kanganablames, Kangana Ranaut, Naga Chaitanya, Sama

ఇకపోతే నాగచైతన్య అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన సంగతి మనకు తెలిసిందే.ఈ సమాజంలోఎవరైతే విడాకులు తీసుకుంటారో ఆ సమయంలో కేవలం పురుషులది మాత్రమే తప్పు ఉంటుందని, వారి దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మారుస్తూ వారిని బలిపశువును చేస్తున్నారని ఈ సందర్భంగా ఈ హీరోయిన్ సమంత విడాకుల విషయంలో ఘాటుగా స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube