సుశాంత్ సారా రిలేషన్ పై స్పందించిన కంగనా!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం బాలీవుడ్ లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్ కూతురు, సారా అలీఖాన్‌తో సుశాంత్ సింగ్ ప్రేమాయణం సాగించారనే విషయం బయటకు వచ్చింది.

ఈ విషయం నిజమేనని సుశాంత్ సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు.కాని సారా అలీఖాన్‌, సుశాంత్ సింగ్ బ్రేక్ అప్ అవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Kangana Comments On Sushanth Sara Relation,Sushanth Singh Rajput, Kangana Ranaut

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే కొంతమంది సుశాంత్ సన్నిహితులు తాజాగా సుశాంత్,సారా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు.అదేంటంటే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పుడు సుశాంత్, సారాను ఓ ప్రైవేట్ జెట్‌లో బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడని, అక్కడ వారిద్దరూ మూడు రోజులు ఎంజాయ్ చేశారని అంటున్నారు.

మరి ఇందులో నిజమెంతో కాలమే సమాధానం చెప్పాల్సివుంది.ఇక గత కొద్దిరోజులుగా వార్తలలో నిలుస్తున్న సుశాంత్-సారా అఫైర్ పై తాజాగా హీరోయిన్ కంగనా స్పందించింది.

Advertisement

గత కొద్దిరోజులుగా సుశాంత్-సారా అఫైర్ గురించి మీడియాలో బోలెడు వార్తలు వస్తున్నాయి.ఒక స్టార్ వారసురాలైన సారా అసలు కష్టపడి పైకి వచ్చిన సుశాంత్ లో ఆశలు కలిగించి అతన్ని కొద్దిరోజుల తర్వాత కారణం లేకుండా వదిలేసిందని అన్నారు.

ఇక ఇప్పటికే ఎందరో ప్రముఖుల గుట్టును రట్టు చేస్తున్న ఈ కేసు ఇంకెన్ని సంచలనాలకు కారణం అవుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు