ఇప్పుడు చాలా మంది హీరోలు డ్రగ్స్‌ కేసులో బయట పడతారు

బాలీవుడ్‌ పై కంగనా చేస్తున్న యుద్దం కొనసాగుతూనే ఉంది.ఆమె వరుసగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మరియు దర్శక నిర్మాతలపై చేస్తున్న ఆరోపణలు మరియు విమర్శలతో వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

 Kangana Comments On Drugs Consume Celebrities In Bollywood, Kangana Ranaut, Rhea-TeluguStop.com

ముఖ్యంగా సుశాంత్‌ మృతి చెందినప్పటి నుండి ఈమె చేస్తున్న ఆరోపణలు మరియు విమర్శలకు హద్దు లేకుండా పోయింది.బాలీవుడ్‌ వారిని మాఫియా అంటూ సంభోదిస్తూ సుశాంత్‌ చనిపోవడానికి వారే కారణం అంటూ కొందరి పేర్లను ప్రముఖంగా వెళ్లడిస్తుంది.

తాజాగా సుశాంత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కూడా ఇన్వాల్వ్‌ అయ్యాయి.రియా చక్రవర్తికి డ్రగ్స్‌ డీలర్‌ తో పరిచయం ఉంది.ఇద్దరి మద్య ఫోన్‌ సంబాషణలు జరగడంతో పాటు ఛాటింగ్‌ కూడా చేసుకున్నారు.అతడి వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేసిన దాఖలాలు మరియు సాక్ష్యాధారాలు లభ్యం అయ్యాయి.

దాంతో రియాను అరెస్ట్‌ చేసేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు.ఈ సమయంలో కంగనా మాట్లాడుతూ ఈ కేసును మరింత డెప్త్‌ గా విచారించాల్సిన అవసరం ఉందని అంటోంది.

డ్రగ్స్‌ కేసులో ఇంకా చాలా మంది బయట పడుతారంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

Telugu Drugs, Kanganadrugs, Kangana Ranaut, Kangana Ranauth, Sushanthsingh-

బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ హీరోలు చాలా మంది డ్రగ్స్‌ తీసుకుంటారు అంటూ కంగనా ఆరోపిస్తుంది.ఇప్పటి వరకు ఈమె చేసిన ఆరోపణలు ఒక ఎత్తు అయితే ఈసారి ఈమె చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తు అనడంలో సందేహం లేదు.డ్రగ్స్‌ కేసులో ఎవరు ఉన్నారు, ఎవరు డ్రగ్స్‌ తీసుకుంటారు అనే విషయంలో తన వద్ద పూర్తి సమాచారం ఉంది అంటూ కంగనా బాలీవుడ్‌ వారిని మరింతగా భయపెడుతోంది.

ప్రముఖ హీరోలు దర్శక నిర్మాతలకు ఈమె మాటలతో కాస్త భయం కనిపిస్తుంది.మరి కంగనా అన్నట్లుగా మరికొందరు కూడా ఈ కేసులో చిక్కుకుంటారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube