కోడెల మృతికి కారణం కొడుకు అంటూ కేసు నమోదు  

Kancheti Sai Comments On Kodela Sivaprasad Son - Telugu Case Register In Police Station, Chandrababu Naidu, Kancheti Sai, Tdp Party Leaders And Ycp Leaders

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నప్పటికి తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా వేదింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.ఇక వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీ నుండి కోడెలను సస్పెండ్‌ చేసేందుకు రంగం సిద్దం అయ్యింది.

Kancheti Sai Comments On Kodela Sivaprasad Son

అందుకే ఆ బాధను తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ వైకాపాకు చెందిన వారు కామెంట్స్‌ చేస్తున్నారు.ఇలాంటి సమయంలోనే కోడెలకు మేనత్త కొడుకు అయిన కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

గత నెలలో కోడెల శివ ప్రసాదరావు గారు నాకు కాల్‌ చేశారు.ఆ సమయంలో నాతో ఆయన తన కుమారుడి గురించి పదే పదే చెప్పారు.కోడెల కుమారుడు శివరాం ఆస్తి విషయంలో గొడవ పడుతూ ఉండేవాడట.కోడెల పేరుమీదున్న ఆస్తిని శివరాం రాయించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించాడంటూ కంచేటి సాయి ఆరోపిస్తున్నాడు.

కోడెల మృతికి కారణం కొడుకు అంటూ కేసు నమోదు-Latest News-Telugu Tollywood Photo Image

గుంటూరు జిల్లాలో పోలీసులకు సాయి ఫిర్యాదు కూడా చేశాడు.సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు