గోవా హోటల్ రూమ్‌లో కాంచ‌న 3 న‌టి మృతి.. మిస్టరీగా నిజాలు?

రాఘవ లారెన్స్ రూపొందించిన కాంచన చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కాంచ‌న 3 సినిమాలో నటించిన యువ నటి రష్యన్ యువతి అలెగ్జాండ్రా జావి అందరికీ గుర్తుండే వుంటుంది.

 Kanchana 3 Actress Alexandra Javi Suicide Issue Viral,  Raghava Lawrence , Kanch-TeluguStop.com

రష్యన్ యువతి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా నటి గోవాలోని ఒక హోటల్ రూమ్లో ఆత్మహత్యకు పాల్పడిందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇంత చిన్న వయసులోనే ఈ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అని ఈ నటి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఈమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే అలెగ్జాండ్రా జావి స్నేహితుల సమాచారం ప్రకారం…జావి ఒక వ్యక్తితో ప్రేమలో పడిందని అయితే గత కొద్ది రోజుల క్రితం తనతో మనస్పర్ధలు రావడం వల్ల తన ప్రేమ విఫలమైందని, ఆ కారణం చేతనే తను పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలిపారు.ఆ ఒత్తిడిని డిప్రెషన్ తట్టుకోలేకే ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని స్నేహితులు తెలియజేశారు.

అదేవిధంగా 2019 వ సంవత్సరంలో సదరు నటిపై చెన్నై ఫోటోగ్రాఫర్ తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.

Telugu Goa Hotel, Kanchana, Love Failure, Russian Actress-Movie

ఈ క్రమంలోనే అతని వేధింపులను తట్టుకోలేక జావి అతని పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనను అరెస్టు చేశారనే విషయం కూడా బయటపడింది.ఈ విధంగా ఆ ఫోటో గ్రాఫర్ వల్ల మళ్లీ సమస్యలు వచ్చాయా? ఆ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Telugu Goa Hotel, Kanchana, Love Failure, Russian Actress-Movie

ఏది ఏమైనప్పటికి కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న ఈ నటి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరం.ఈమె మృతి చెందిన విషయం తెలియగానే పలువురు షాక్ అవుతున్నారు.ఈ నటి మరణవార్తను వారి తల్లిదండ్రులకు చేరవేసి, ఈమె మృతికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube