‘ముని’, ‘కాంచన’ సినిమాలతో నవ్వించి, భయపెట్టిన లారెన్స్ ‘కాంచన`2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభం అయినా కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.
మొదట ఈ సినిమాకు ‘గంగా’ అనే టైటిల్‌ను పెట్టాలనుకున్నారు.కాని ‘కాంచన’ సూపర్ హిట్ అవ్వడంతో అదే పేరుతో విడుదల చేస్తే ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను లారెన్స్ విడుదల చేశాడు.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ఏక కాలంలో చిత్రీకరించడం జరిగింది.
తాజాగా ఈ సినిమా తమిళ వర్షన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఆ ఫస్ట్‌లుక్‌లో లారెన్స్ గెటప్ భయంకరంగా ఉంది.
‘ముని’, ‘కాంచన’ సినిమాలతో పోల్చితే ఈ సినిమా మరింత భయంకరంగా ఉంటుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తేనే తెలుస్తోంది.ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది.
సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది.