అలాంటి చెత్త గ్యాంగ్ కు నా సపోర్ట్ ఉండదు  

Kanagana Comments On Deepika Padukone-indian Army,kanagana

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కొన్ని రోజుల క్రితం జేఎన్ యు లోకి వెళ్లి అక్కడి విద్యార్థులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.ఆ విషయంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.కేంద్ర మంత్రులు మరియు బీజేపీ నాయకులు ఆమెపై తీవ్ర విమర్శలు చేసారు.సినీ వర్గాల వారు కూడా దీపికా పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

Kanagana Comments On Deepika Padukone-Indian Army

ఇదే విషయంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా తీవ్రంగా స్పందించింది.

దీపికా ఎక్కడికి అయినా వెళ్లి మద్దతు తెలిపే అర్హత కలిగి ఉంది.ఆమె కు ఆ స్వేచ్ఛ ఉంది.కానీ నేను మాత్రం దేశ ద్రోహులు మద్దతు తెలపను.

మన సైనికులు చనిపోతే పండుగ చేసుకునే వారికీ నేను ఎప్పుడు మద్దతుగా నిల్వను.అలాంటి చెత్త గ్యాంగ్ లను నేను సమర్ధించాలని భావించడం లేదు.

ప్రతి ఒక్కరు కూడా అలాంటి చెత్త గ్యాంగ్ కు సపోర్ట్ చేయవద్దని నేను కోరుకుంటున్నాను అంది.ఈ వ్యాఖ్యలు దీపికా కు కౌంటర్ అంటూ బాలీవుడ్ వారు అంటున్నారు.

.

తాజా వార్తలు