పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న గోపీచంద్ హీరోయిన్  

Kamna Jethmalani Prabhu Tollywood - Telugu Kamna Jethmalani Planning Re Entry Into Films, South Cinema, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో రణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కామ్నా జెఠ్మలానీ.తెలుగులో ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు చేసిన కూడా ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు.

 Kamna Jethmalani Prabhu Tollywood

చిన్న సినిమాలకి, ఐటెం సాంగ్స్ కి పరిమితం అయిపోయిన ఈ అమ్మడు ఆరేళ్ళ క్రితం పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది.ప్రముఖ న్యాయ కోవిదుడు రాం జెఠ్మలానీకి ఈమె మనవరాలు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

అయితే గతంలో హీరోయిన్స్ గా చేసిన అందాల భామలు మర సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తున్నారు.వారికి సరిపోయే పాత్రలు చేస్తూ సందడి చేస్తున్నారు.ఇప్పుడు ఇదే దారిలో కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.కామ్న తాజాగా తెలుగులో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది.

పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న గోపీచంద్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించనుంది.ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ కొత్తవాళ్ళు నటిస్తారని తెలుస్తుంది.

మరి హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kamna Jethmalani Prabhu Tollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test