ఈ 'కమ్మ' గోల ఏంటి జగన్ ?  

Kamma Community In The Ysrcp Are Deeply Dissatisfied Kodali Nani - Telugu Cm Ys Jagam, Election Commissioner, Kamma Community, Kodali Nani, Nimmagadda Ramesh

ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంతకు ముందు నుంచి ఆ పార్టీ నాయకులు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ వచ్చారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా వ్యవహారం మరింత ఎక్కువైంది.

 Kamma Community In The Ysrcp Are Deeply Dissatisfied Kodali Nani

టిడిపి అధినేత చంద్రబాబు మీద ఉన్న కోపాన్నంతా ఆ సామాజిక వర్గంపై చూపిస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇక వైసీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఇదే తరహా ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టేందుకు వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు పోటీపడుతూ తిట్ల పురాణం అందుకుంటూ వస్తున్నారు.ఈ వరుసలో ఏపీ మంత్రి కొడాలి నాని ముందుంటున్నారు.

ఈ ‘కమ్మ’ గోల ఏంటి జగన్ -Political-Telugu Tollywood Photo Image

ఆయన ప్రతి విషయానికి కమ్మ అనే పదం ఉపయోగిస్తూ టిడిపి నాయకుల పై విమర్శలు చేస్తూ రావడం షరా మామూలుగా మారింది.

ఈ వ్యవహారాన్ని అందరూ తేలిగ్గా తీసుకున్నారు.

ఇప్పుడు మాత్రం వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ వైసీపీ నాయకులు ఆయన కులాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.

ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మింగుడు పడడం లేదు.వైసీపీని ఆదరించే వారిలో కమ్మ సామాజిక వర్గం నేతలు ప్రజలు ఎక్కువగానే ఉన్నారు.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గం వారు వైసీపీకి భారీగానే విరాళాలు అందించారు.అయినా అదే పని కమ్మ అనే పదాన్ని ఉపయోగిస్తూ విమర్శలు చేస్తుండడంతో ఆ సామాజిక వర్గ వారంతా నొచ్చుకుంటున్నారు.

కమ్మ సామాజిక వర్గం వారు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వారి ఆదరణ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వైసిపి గెలుపొందింది.ఈ విధంగా పొన్నూరు, తెనాలి, వినుకొండ, చిలకలూరిపేట, మైలవరం, నరసరావుపేట ఎంపీ సీటు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరింది.

అయినా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ వైసిపి నాయకులు నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు వరకు విమర్శలు చేస్తుండడంతో వైసీపీ లో ఉన్న కమ్మ సామాజికవర్గ నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.వైసీపీకి కమ్మ సామాజిక వర్గం అండగా నిలిచినా ఆ కులాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ వారు వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kamma Community In The Ysrcp Are Deeply Dissatisfied Kodali Nani Related Telugu News,Photos/Pics,Images..