చంద్రబాబు కి కమ్మ షాక్ గట్టిగా తగలబోతోందా  

ఏపీలో రాజకీయ పరిస్థితిలు రోజు రోజుకి మారిపోతున్నాయి..ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న సామాజిక వర్గం నేతలు కానీ..వివిధ పార్టీల నేతలు ,అసంతృప్తులు, ఒక్క సారిగా తమ పంజా విసరడానికి సిద్దం అవుతారు..ఇది సహజంగా సర్వ సాధారణంగా జరిగే విషయమే..తమ బలాబలాలు చూపించుకుంటూ స్థానిక నేతలు సీట్ల కోసం పోటీ పడుతూ ఉంటారు..వివిధ సామాజిక వర్గాల నేతలు సైతం తమ గళాలని వినిపిస్తూ పార్టీల అధినేతలకి చుక్కలు చూపిస్తూ ఉంటారు అయితే..

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో లో జరగనున్న త్రిముఖ పోరు నేపధ్యంలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి ముఖ్యంగా ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి అయితే ఇది కూడా సాధారణమే అనుకోవచ్చు కానీ చంద్రబాబు ఊహించని రీతిలో సొంత సామాజిక వర్గం అయిన కమ్మ నేతలు..కమ్మ సామాజిక వర్గ నాయకులు ఇప్పుడు తిరుగుబావుటా ఎగరేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..ఇంతకీ బాబు సొంత సామాజిక వర్గం ఎందుకు బాబుపై ఎదురుదాడి మొదలు పెట్టింది అనే వివరాలలోకి వెళ్తే..

Kamma Community Angry With Cm Chandrababu-

Kamma Community Angry With Cm Chandrababu

కమ్మ సామాజిక వర్గం నేతలు బాబు పై గుర్రుగా ఉన్నారు అన్న విషయం టీడీపీ నేతలని కంగారు పెట్టిస్తోంది

సీఎం గా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందట రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ తమకి బాబు నుంచీ సహకారం అందటం లేదని కమ్మ వర్గం నాయకుల్లో అసంతృప్తి నెలకొంది అంటున్నారు…గత ఎన్నికల్లో చంద్రబాబు కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆర్ధికంగా ఊతం ఇచ్చిన నేతలకి బాబు నుంచీ సహకారం లేకపోవడంతో ఈ సారి బాబు కి సహాయనిరాకరణ తప్పదనే టాక్ వినిపిస్తోందట.

అంతేకాదు బాబు తో పాటు లోకేష్ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన లేదని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అందుకే ఈ సారి బాబు కి చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారట కమ్మ సంఘాల నేతలు అయితే ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో ప్రధానమైన కమ్మ కంచుకోటలుగా పేరున్న గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని ‘కమ్మ’ సామాజికవర్గ నేతలు..వైసీపీతో ఇప్పటికే టచ్ లో ఉన్నారని వారిని భవిష్యత్తులో వైసీపీలోకి రప్పించేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేయిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది..ఇదిలాఉంటే కమ్మ వర్గం నేతల అసంతృప్తిన క్యాష్ చేసుకోవడం కోసం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఎలా అయినా సరే చంద్రబాబు ని తన సామాజిక వర్గం నేతల ద్వారానే దెబ్బ కొట్టించాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది..మరి ఈ సమయంలో బాబు తన వర్గం నేతలని ఎలా సముదాయిస్తారో జగన్ వ్యుహాలకి ఎలాంటి చెక్ పెడుతారో వేచి చూడాలి.