నాలుగోవ సారి కూడా ఆడపిల్లే పుట్టింది అని తెలిసి,కసాయి తండ్రి దారుణం

ఎవరెన్ని విధాలుగా వివరించినప్పటికీ కూడా ఆడ పిల్ల అనగానే ఇంకా చాలా మంది లో ఒక చిన్న చూపు అలానే ఉండిపోయింది.మగపిల్లాడు ఎలాగో,ఆడపిల్ల కూడా అలాగే అని ఎన్నిసార్లు ఎంతమంది మొత్తుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ వివక్షత అనేది కొనసాగుతూనే ఉంది.

 Kambalia Solamki Gujarath Birth Father-TeluguStop.com

ఇలాంటి వివక్షతకు కొంతమంది ఆడపిల్లలు బలైపోతున్నారు కూడా.ఒకపక్క అత్యాచారాలు,హత్యలతో కొంతమంది ఆడవాళ్ల ప్రాణాలను చిదిమేస్తుంటే మరికొంత మంది ఆడపిల్ల లే పుట్టారు అంటూ చిదిమేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి.

తాజాగా గుజరాత్ లో నాలుగవ సారి కూడా ఆడపిల్లే పుట్టింది అన్న కారణంగా కన్న తండ్రి ముందుగా పుట్టిన ముగ్గురు ఆడపిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా ఖంబాలియా గ్రామంలో చోటుచేసుకుంది.

Telugu Gujarath, Unhappy-

ఖంబాలియా గ్రామానికి చెందిన సోలంకి(30) అనే గ్రామ రక్షక్ దళ్ జవాన్ తన భార్యకు నాలుగోవ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టింది అని, తన ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి హత్య చేసి,అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.భార్య కాన్పు నిమిత్తం తన పుట్టింట్లో ఉన్న సమయంలో సోలంకి ఇలా తన ముగ్గురు కుమార్తెలను పొట్టన పెట్టుకొని అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube