కామసూత్ర త్రీడీ భామ ఆకస్మిక మృతి! పట్టించుకోని మీడియా  

Kamasutra 3d Movie Actress Died With Heart Stroke -

సినిమా ఇండస్ట్రీలో నటుల జీవిత కాలం చాలా తక్కువ.వాళ్ళకి క్రేజ్ ఉన్నంత కాలమే మీడియా ద్రుష్టి వారి మీద ఉంటుంది.

Kamasutra 3d Movie Actress Died With Heart Stroke

క్రేజీ తగ్గిపోయిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు అనే విషయం కూడా మీడియా పట్టించుకోదు.ఇప్పుడు ఓ నటి విషయంలో మరో సారి అది రుజువైంది.బాలీవుడ్ లో కామసూత్ర త్రీడీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి సైరా ఖాన్ గుండెపోటుతో తాజా గా కన్నుమూశారు.2013లో రూపేష్ పాల్ దర్శకత్వంలో వచ్చిన కామసూత్ర త్రీడీలో ఆమె పాపులర్ అయ్యారు.

సైరా ఖాన్ మృతిపై కామసూత్ర దర్శకుడు రూపేష్ పాల్ విచారం వ్యక్తం చేశారు.సైరా మృతి వార్త షాకింగ్ అనిపించింది.కానీ ఆమె మృతిని ఏ ఒక్క మీడియా సంస్థ కూడా పట్టించుకోకపోవడం మరింత బాధాకరం అనిపించింది.అందుకే ఆమె మృతిపై నేనే ఒక ప్రకటన విడుదల చేస్తున్నాను.

నిజానికి సైరా లాంటి నటికి చాలా గుర్తింపు రావాల్సింది.ఏదేమైనా ఇది సంతాప సందర్భం.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నా అని రూపేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు