తమిళ రాజకీయాల్లో కొత్త శకం,చేతులు కలపనున్న కమల్,రజనీ  

Kamalhaasan And Rajinikanth Both Are Joining Their Hands For Politics - Telugu Hands For Politics, Kamalhaasan, Kamalhaasan And Rajinikanth, Rajinikanth, Tamil Nadu Politics

తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు.ప్రజల సంక్షేమమే తమ లక్ష్యం అంటూ మక్కల్ నీది మయ్యాం అధ్యక్షుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేతులు కలపడానికి సిద్ధం అంటూ ప్రకటించారు.

Kamalhaasan And Rajinikanth Both Are Joining Their Hands For Politics

తమిళ ప్రజల కోసం కమల్ పార్టీ తో కలిసి ముందుకు సాగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రజనీ వ్యాఖ్యలపై కమల్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అందుకే రజనీ తో కలిసి రాజకీయాల్లో ముందుకు సాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ స్పష్టం చేశారు.

మా ఇద్దరి మధ్య 44 ఏళ్ల స్నేహం ఉంది, ఆయనతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, భవిష్యత్తు లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది ముందు ముందు తెలుస్తుంది అని కమల్ స్పష్టం చేశారు.మరోపక్క రజనీ కూడా గత మూడు సంవత్సరాలుగా పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు మాత్రం పార్టీ పేరు విషయంలో గానీ పార్టీ పాటించబోయే ఎజెండా పై గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు తాజాగా మాత్రం రజనీ కమల్ తో కలిసి రాజకీయాల్లో కొనసాగుతానని తాజాగా ప్రకటించడం తో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికినట్లు అయ్యింది.మరి భవిష్యత్తు లో వీరిద్దరూ కలిసి ఎలా ముందుకు నడుస్తారో అన్న విషయం ముందు ముందు తెలుస్తుంది.

కమల్ లాంటి దూకుడు ఉన్న నేత, రజనీ లాంటి వ్యక్తి తో ఎలా రాజకీయాలను నెరుపుతారు అన్న విషయం పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ కి నిలబడిన కమల్ పార్టీ సీట్లు గెలవక పోయినప్పటికీ భవిష్యత్తు రాజకీయాల్లో మాత్రం ఆ పార్టీ స్థానం సంపాదించగలుగుతుంది అన్న ఆశలు మాత్రం చిగురించాయి.ఇక తమిళ నాట భవిష్యత్తు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న విషయం పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kamalhaasan And Rajinikanth Both Are Joining Their Hands For Politics Related Telugu News,Photos/Pics,Images..

footer-test