జగన్‌ ప్రభుత్వంపై కమలానంద భారతి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాస్టర్స్‌కు మరియు మసీదుల్లో పని చేసే వారికి నెల జీతాలను ఇచ్చేందుకు ముందుకు రావడంపై హిందూ దేవాలయ ప్రతిష్టాన్‌ పీఠం అధిపతి కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.వారికి ప్రభుత్వం నుండి నేరుగా జీతాలు ఇవ్వడం ఏంటీ అంటూ ప్రశ్నించారు.

 Kamalanandha Bharathifire On Jagangovernament Ap-TeluguStop.com

హిందూ దేవాలయాల్లో పూజారులకు ఏర్పాటు చేసినట్లుగా ఒక శాఖను ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి జీతాలు ఇవ్వాలని సూచించారు.ఇక గ్రామాల్లో నియమించబడిన వాలింటీర్లు క్రైస్తవ మత ప్రచారకులుగా పని చేసే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

హిందూ దేవాలయాల్లో ఎక్కడ కూడా అన్య మతస్థులు ఉండవద్దని కమలానంద భారతి కోరారు.ఏ దేవాలయంలో ఉన్నా కూడా వారిని ఏరి వేసి వెంటనే వారిని తొలగించాలంటూ స్వామిజీ డిమాండ్‌ చేశారు.

ఇక టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచడం పట్ల కూడా ఆయన స్పందించారు.రాజకీయ నిరుద్యోగుల కోసం బోర్డు సభ్యుల సంఖ్య పెంచడం జరుగుతుందని, దాని వల్ల లాభం ఏమీ లేదని, ఆర్థికంగా ఖర్చు తప్ప సభ్యులు పెరిగితే జరిగే ప్రయోజనం శూన్యం అంటూ కమలానంద భారతి అన్నారు.

వైకాపా ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుందంటూ ఆయన హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube