‘VOGUE’ కవర్ పేజీపై కమలా హారిస్.. తెరపైకి వివాదం

భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు ఆమెను ఆకాశానికెత్తేశారు.

 Kamala Harriss Vogue Cover Has Sparked A Controversy-TeluguStop.com

జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అదే రోజున కమలా హారిస్ కూడా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో 125 ఏళ్ల చరిత్ర కలిగిన మేగజైన్… వోగ్, 2021 ఫిబ్రవరి ఎడిషన్ కవర్ పేజీ‌పై కమలా హారిస్‌ ఫోటోను ప్రింట్ చేస్తోంది.దీని కోసం వోగ్ ఎంచుకున్న 2 కవర్ ఫోటోలు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

గత శనివారం నుంచి ఈ కవర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీటిలో ఒక దానిలో హారిస్… డార్క్ సూట్‌లో పింక్, గ్రీన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా… మరో దాంట్లో… గ్రే సూట్‌లో గోల్డ్ బ్యాక్ డ్రాప్‌లో ఉన్నారు.

వీటిలో వివాదం ఏముందని మనకు అనిపించవచ్చు.తాజాగా వోగ్ మరో ఫొటో రిలీజ్ చేసింది.అందులో కమలా హారిస్..

పౌడర్ బ్లూ సూట్‌తో ఉన్నారు.అయితే వాస్తవానికి ఈ మూడో ఫొటోను మేగజైన్ కవర్ పేజీగా వేసుకోమని హారిస్ టీమ్.

వోగ్ టీమ్‌కి చెప్పినట్లు సమాచారం.

Telugu Joe Biden Vogue, Green Backdrop, Kamala Harris, Tylermichael-Telugu NRI

బ్లూ సూట్, గోల్డ్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫొటోను కవర్ పేజీపై వేస్తామని హారిస్‌ టీమ్‌కి వోగ్ చెప్పినట్లు తెలిసింది.కానీ ఆ ఫొటో బదులు… తాజాగా… పింక్, గ్రీన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.నిజానికి ఈ పింక్, గ్రీన్ ఫొటోను హారిస్ టీమ్ ఒప్పుకోలేదని సమాచారం.

తాము వేయ్యొద్దన్న ఫొటోను వోగ్ ఎందుకు తెరపైకి తెచ్చిందన్న దానిపై హారిస్ బృందం మండిపడటంతో వివాదం రాజుకుంది.

Telugu Joe Biden Vogue, Green Backdrop, Kamala Harris, Tylermichael-Telugu NRI

ఈ రెండు ఫొటోలనూ టైలెర్ మైఖెల్ అనే ఆఫ్రో అమెరికన్ ఫొటోగ్రాఫర్ షూట్ చేశారు.తాజా వివాదంపై టైలెర్ స్పందించలేదు.ఆయన ప్రతినిధి మాత్రం ట్విట్టర్‌లో పౌడర్ బ్లూ సూట్ లో ఉన్న హారిస్ ఫొటోను షేర్ చేశారు.

మరోవైపు వోగ్ మేగజైన్‌ కవర్ ఫొటోపై కమలా హారిస్ రాబోతుండటాన్ని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube