అమెరికా: కమలా హారిస్‌కు కరోనా నెగిటివ్‌, ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఈ వారం ప్రారంభంలో తన సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా రావడంతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌‌‌కు చేసిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో కుటుంబంతో కలిసి సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న కమలా హారీస్‌తో గత మంగళవారమంతా వున్న సహాయకుడికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

 Kamala Harris Tests Negative For Coronavirus After Close Contact , Kamala Harris-TeluguStop.com

దీంతో అప్రమత్తమైన అధికారులు.ఆమెకు మరుసటి రోజే పరీక్షలు నిర్వహించారు.

సోమవారం ఉపాధ్యక్షురాలికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఆమె కార్యాలయం తెలిపింది.ర్యాపిడ్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్‌లలో హారిస్‌కు కరోనా సోకలేదని తెలిపింది.

కమలా హారిస్ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.దానితో పాటు బూస్టర్ డోసును కూడా తీసుకున్నారు.

అలాగే వైట్‌హౌస్ ప్రోటోకాల్ ప్రకారం ఎప్పటికప్పుడు పరీక్షలకు హాజరవుతూ వుంటారు.కమలా హారిస్ వెంట వున్న సహాయకుడు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు ఈ వారం ప్రారంభంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి నెగిటివ్ వచ్చినట్లు ఉపాధ్యక్ష కార్యాలయం తెలిపింది.

హారిస్, ఆమె భర్త డగ్లస్​ ఎమ్‌హాఫ్‌లు శుక్రవారం లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ స్టేషన్ 94లో అగ్నిమాపక సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అటు కమలా హారిస్ భర్త… ఎమ్​ హాఫ్‌కు నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కోవిడ్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.జో బైడెన్‌ పాలనా యంత్రాంగంలో ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది.

అతను బైడెన్‌తో కలిసి ప్రయాణించినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌ సాకీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్‌లో ఉండరని… అయితే డిసెంబరు 17న మాత్రం దక్షిణ కరోలినా నుంచి ఫిలడెల్ఫియాకు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బైడెన్‌తో పాటు ప్రయాణించారని జెన్‌సాకీ పేర్కొన్నారు.

ఆ సమయంలో‌నే బైడెన్‌ వద్ద దాదాపు 30 నిమిషాలు గడిపినట్లు ఆమె తెలిపారు.

Telugu Booster Dose, Doug Emhoff, Kamala Harris, Kamalaharris, Philadelphia, Whi

సదరు ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్‌ అని తేలగానే వైట్‌హౌస్ అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు.ఈ క్రమంలోనే బైడెన్‌కు ఆదివారం యాంటీజెన్‌, సోమవారం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.ఈ రెండు టెస్టుల్లోనూ ఆయనకు నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

అయితే సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కరోనా బాధితులతో కాంటాక్ట్‌‌లో వున్నప్పటికీ ఎలాంటి క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని జెన్‌ సాకీ తెలిపారు.

అందువల్లే జో బైడెన్ తన రోజువారీ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారని వెల్లడించారు.వైట్‌హౌస్‌లోని సిబ్బంది రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్‌ డోసులు కూడా తీసుకున్నట్లు జెన్ సాకీ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube