నిన్నటి దాకా ఎలక్షన్ వార్: కుకింగ్‌తో సేదతీరుతున్న కమలా హారిస్

సాధారణంగా ఎవరికైనా విరామం ఉంటుందేమో కానీ రాజకీయ నాయకుడికి విశ్రాంతి అనేది వుండదంటారు.ఎత్తులు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు ఇలా రాజకీయ వైకుంఠపాళిలో కిందకు పడిపోకుండా వుండాలంటే అనుక్షణం అప్రమత్తంగా, క్షణం తీరిక లేకుండా గడపాల్సిందే.

 Kamala Harris Shares A Recipe, No, It's Not Dosa, Kamala Harris, Thanksgiving-TeluguStop.com

అలాంటి వారికి కాస్తో కూస్తో విశ్రాంతి దొరికేది ఎన్నికలు అయిపోయి, అధికార మార్పిడి జరిగే సమయంలోనే .ప్రస్తుతం ఇదే తరహా వాతావరణంలో ఉన్నారు కమలా హారిస్.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె.త్వరలోనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.అందుకు కాస్తంత వ్యవధి వుండటంతో కిచెన్‌లో గడుపుతున్నారు.కమలా హ్యారిస్‌కు వంట చేయడం అంటే చాలా ఇష్టం.ఈ విషయాన్ని ఆమె పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.తాజాగా తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన కార్న్‌బ్రెడ్‌ రెసిపీని సోషల్ ‌మీడియా ద్వారా షేర్ ‌చేశారు.

కార్న్‌బ్రెడ్‌ కి కావాల్సినవి.కార్న్‌బ్రెడ్‌ మిక్స్‌, సాసేజ్‌, ఉల్లిపాయలు, ఆపిల్‌, సెలెరీ కాండా, చికెన్‌, వెన్న, రోజ్‌మేరి, ఉప్పు, మిరియాలు.

ఈ సింపుల్‌ పదార్థాలతో కార్న్‌బ్రెడ్‌ డ్రెస్సింగ్ ఎలా తయారుచేయాలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు కమలా హ్యారిస్‌.దీన్ని థ్యాంక్స్‌ గివింగ్‌లో భాగంగా తన కుటుంబానికి వండి పెట్టేందుకు ఈ రెసిపీని ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు.

కార్న్‌బ్రెడ్‌ రెసిపీ లేకుండా థ్యాంక్స్‌ గివింగ్‌ భోజనం పూర్తి కాదని గతంలోనూ కమలా వెల్లడించారు.

ఇక అమెరికాలో ఏటా నవంబర్‌ చివరి వారంలో థ్యాంక్స్‌ గివింగ్‌ జరుపుకుంటారు.రకరాకల వంటకాలతో కుటుంబం అంతా ఒకచోట చేరి ఆనందంగా మీల్స్‌ని ఎంజాయ్‌ చేస్తారు.కమలా హారిస్‌ జనవరి 20న జో బైడెన్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళ, తొలి ఆసియన్‌గా, తొలి నల్లజాతీయురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube