సుప్రీంకోర్టు జడ్జి నియామకం.. ఇంతకన్నా మంచి టైం దొరకలేదా: కమలా హారిస్ నిప్పులు

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స‌్‌బర్గ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.న్యాయమూర్తి అమీ కోన్ బ్యారెట్‌ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేయడం పట్ల డెమొక్రాటిక్ పార్టీ నేత, కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారీస్ భగ్గుమంటున్నారు.

 Supreme Court Confirmation Hearing Amid Pandemic reckless: Kamala Harris, Kamala-TeluguStop.com

బ్యారెట్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన కన్ఫర్మేషన్ హియరింగ్‌ను అధికారులు సోమవారం చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభ సమయం ముగిసిన తరువాత బ్యారెట్‌ను నామినేట్ చేసి ఉంటే బాగుండేదని కమలా హ్యారిస్ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అమీ కోన్ బ్యారెట్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేసే ప్రక్రియకే రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కమల ఆరోపించారు.
ఇక్కడ మరో కారణం గురించి కూడా ప్రస్తావించాలి.

అమెరికా చట్టాల ప్రకారం.కింది న్యాయస్థానానికి చెందిన ఓ న్యాయమూర్తిని సుప్రీంకోర్టుకు నామినేట్ చేయడానికి కనీసం 50 మంది సెనెటర్లతో కూడిన కమిటీ కన్ఫర్మేషన్ హియరింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఒకేసారి 50 మంది కమిటీ సభ్యులు, తలుపులు మూసి ఉంచిన ఒకే గదిలో కొన్ని గంటల పాటు హియరింగ్‌లో పాల్గొంటారు.దీనివల్ల కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని కమలా హారిస్ అభ్యంతరం చెబుతున్నారు.

స్వతహాగా న్యాయవాది అయిన కమల.ఈ కన్ఫర్మేషన్ హియరింగ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.కరోనా సమయంలో ఈ ప్రక్రియను చేపట్టడం వల్ల జ్యుడీషియల్ స్టాఫ్, పోలీసులు, ఇతర సిబ్బంది ప్రాణాలను రిస్క్‌లో పడేసినట్టయిందని వ్యాఖ్యానించారు.స్త్రీ సాధికారత, హక్కుల సంరక్షణ కోసం పాటుపడిన రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ 87 యేళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే.

యూఎస్ అత్యున్నత న్యాయస్థానాన్ని అధిరోహించిన రెండో మహిళగా గిన్స్‌బర్గ్ 27 యేళ్లపాటూ సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube