యూఎస్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజరీ గ్రూప్‌లో భారతీయుడికి కీలక పదవి.. కమలా హారిస్ ఆదేశాలు

యూఎస్ నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజరీ గ్రూప్‌లో భారత సంతతికి చెందిన రాజీవ్ బద్యాల్‌కు కీలక పదవిని కట్టబెట్టారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

 Kamala Harris Names Indian-american Rajeev Badyal To National Space Council Advi-TeluguStop.com

డిసెంబర్ 16న నేషనల్ స్పేస్ కౌన్సిల్ యూజర్స్ అడ్వైజరీ గ్రూప్‌కి 30 మంది నిపుణులను కమలా హారిస్ నియమించారు.ఇందులో రాజీవ్ కూడా వున్నారు.

దీనికి యూఎస్ ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ జనరల్ లెస్టర్ లైల్స్‌ను చైర్‌గా నియమించారు.

రాజీవ్ గతంలో స్పేస్ ఎక్స్‌లో శాటిలైట్స్‌ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.

ప్రస్తుతం ఆయన అమెజాన్‌లో ప్రాజెక్ట్ కైపర్ వైస్ ప్రెసిడెంట్‌గా వున్నారు.ప్రాజెక్ట్ కైపర్ అంటే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సమూహాన్ని ప్రారంభించేందుకు ఒక దీర్ఘకాలిక కసరత్తు.

ఇది ప్రపంచవ్యాప్తంగా పలు కమ్యూనిటీలకు తక్కువ జాప్యంతో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది.ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో రాజీవ్ మాస్టర్స్ చేశారు.

పౌర, వాణిజ్య, అంతర్జాతీయ, ప్రభుత్వ విధానాలు, చట్టాలు , నిబంధనలు, ఒప్పందాలు, అంతర్జాతీయ సాధనాలు, కార్యక్రమాలు, అంతరిక్ష విధానం, వ్యూహానికి సంబంధించిన విషయాలపై యూజర్స్ అడ్వైజర్ గ్రూప్ సిఫార్సులను అందజేస్తుంది.

ఇదిలావుండగా.

భారత సంతతికి చెందిన రిచర్డ్ వర్మను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్‌కు డిప్యూటీ సెక్రటరీగా జో బైడెన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.52 ఏళ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీ చట్టం, విధాన పరమైన విధులను పర్యవేక్షిస్తారు.

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.ఈ ఏడాది ప్రారంభంలోనూ బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగానూ రిచర్డ్ వర్మను నియమించిన సంగతి తెలిసిందే.

ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ (పీఐఏబీ) అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ .

Telugu Indianamerican, Joe Biden, Kamala Harris, Kamalaharris, Ohnstown, Pennsyl

ఇకపోతే.రిచర్డ్ వర్మ తల్లిదండ్రులు భారత్ నుంచి 1960వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు.ఆయన తండ్రి దాదాపు నలభై ఏళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ పీట్స్‌బర్గ్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

వర్మ తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడం విశేషం.జాన్స్‌టౌన్, పెన్సిల్వేనియాలలో రిచర్డ్ వర్మ పెరిగారు.

వెస్ట్‌మాంట్ హిల్‌టాప్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో ఎల్ఎల్ఎం, వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లాలో జేడీ, లెహి వర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube