కమలా హారీస్ సరికొత్త రికార్డ్...!!!  

Kamala Harris Have Huge Response In America-

భారత సంతతికి చెందిన కమలా హారీస్ వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.అయితే కొన్ని నెలల నుంచీ ఆమె ప్రచారంలో మునిగిపోయింది.అయితే ఈ క్రమంలో ఆమె అమెరికాలో సరికొత్త రికార్డ్ సృష్టించారు.ప్రఖ్యాత సీఎన్‌ఎన్ టీవీ చానెల్‌లో , కమలా పాల్గొన్న టౌన్ హాల్ కార్యక్రమాన్ని ప్రజలు ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో వీక్షించారని ఆ ఛానెల్ ప్రకటించింది.

Kamala Harris Have Huge Response In America--Kamala Harris Have Huge Response In America-

అయితే ఈ కార్యక్రమం సగటున చూసిన వారి సంఖ్య 19లక్షల చీలుకు ఉందని ఆ ఛానెల్ తెలిపింది.గతంలో నిర్వహించిన నాలుగు టౌన్ హాల్ కార్యక్రమాలకు ఈ సగటు 11లక్షలేనని సీఎన్‌ఎన్ ఓ ప్రకటనలో తెలిపింది.అయితే ఈ కార్యక్రమాన్ని అధికంగా 25 నుంచి 54ఏళ్ల మధ్య వయస్సు వారు చూశారని ప్రకటించింది.

కమలాని చాలామంది బరాక్ ఒబామాతో పోల్చుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.ఆమె విధానాలు ఎలా ఉండబోతున్నాయి.??? అమెరికా అభివృద్దికి ఆమె వ్యూహాలు ఏమిటి అనే అంశాలపై ఆమెని ఆ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.అయితే అమెరికా చరిత్రలో ఎ ఒక్క రాజకీయ నేత పాల్గొన్న కార్యక్రమానికీ ఈ స్థాయిలో ప్రజలు ఆదరించలేదని ప్రముఖ నీల్సన్ సర్వే సంస్థ ప్రకటించింది.