ఇదంతా నీవల్లే...ట్రంప్ ని ఏకి పారేసిన కమలా హారీస్...!!!

అమెరికాలో కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజ్రుమ్భిస్తోందంటే అందుకు కారణం కేవలం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారీస్ ప్రకటించారు.బిడెన్ తో కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఆద్యాంతం ట్రంప్ పై నిప్పుల వర్షం కురిపించారు.

 Kamala Harris Fires On Trump, Us Elections, Vice President, Joe Biden, Donald Tr-TeluguStop.com

మంచి వ్యాఖ్యాతగా ఎంతో తెలివైన రాజకీయ మేధావిగా పేరున్న కమలా హారీస్ అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ పడిన విషయం విధితమే కానీ అనూహ్యంగా బిడెన్ సీన్ లోకి రావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.కానీ ఊహించని విధంగా ఆమె ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికవ్వడంతో డెమోక్రటిక్ పార్టీ విజయమే లక్ష్యంగా స్పీడు పెంచారు…

భారత సంతతి మహిళగా పేరున్న కమలా హారీస్ కి ప్రవాస భారతీయుల మద్దతు బలంగా ఉంది.

బిడెన్ ఉపాధ్యక్ష పదవికి కమలా హారీస్ పేరుని ఎంపిక చేసిన తరువాత ఇద్దరు కలిసి డెలావర్ లోని విల్మింగ్ టన్ లో ప్రచారం మొదలు పెట్టిన తరుణంలో ట్రంప్ పై విమర్శలు పెద్ద ఎత్తున గుప్పించారు.అమెరికాలో కరోనా మరణాలు , కేసులు పెరగడానికి ప్రధాన కారణం ట్రంప్ కాదా అంటూ ప్రశ్నించారు.

కరోనా ని ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలమయ్యారని అన్నారు.

Telugu Corona, Donald Trump, Joe Biden, Kamalaharris-

కరోనా మహమ్మారి ప్రతీ దేశానికి అంటుకుందని అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కరోనా ఉన్నా చాలా దేశాలు ప్రజలని అప్రమత్తం చేయడంలో సఫలం అయ్యాయని ఈ క్రమంలోనే కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గాయని కానీ అగ్ర రాజ్యంగా ఉన్న మనం కరోనా పై పోరులో ఓటమి చెందటానికి ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రపంచం ముందు నవ్వుల పాలు కావడానికి ట్రంప్ కారణమని అన్నారు.ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ట్రంప్ ని ఏకి పారేసేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube