వైట్ హౌస్ లో కమలా హారీస్ ప్రాధాన్యత తగ్గుతోందా...? తగ్గిస్తున్నారా...?

Kamala Harris Faces Early Staff Exists And Trouble In White House

కమలా హారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన తరువాత మొట్టమొదటి సారిగా గర్వించిన దేశం భారత దేశం.ఓ భారత సంతతి మహిళ అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు.

 Kamala Harris Faces Early Staff Exists And Trouble In White House-TeluguStop.com

ఆమె ఎన్నికపై ప్రపంచ మొత్తం హర్షం వ్యక్తం చేసింది.అధ్యక్షుడు బిడెన్ కమలా హారీస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

కీలకమైన పదవులు అప్పగిస్తూ ఆమెకు అధికారాలు అప్పగించారు.ఇటీవల బిడెన్ ఆరోగ్య పరీక్షల కారణంగా కమలా కు గంట పాటు అధ్యక్షురాలిగా భాద్యతలు అప్పగించారు.

 Kamala Harris Faces Early Staff Exists And Trouble In White House-వైట్ హౌస్ లో కమలా హారీస్ ప్రాధాన్యత తగ్గుతోందా… తగ్గిస్తున్నారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కమలా హరీస్ ఎన్నికయిన నాటి నుంచీ ఓ వార్త ప్రపంచ వ్యాప్తంగా చెక్కర్లు కొడుతోంది అదేంటంటే బిడెన్ వయసు మీద పడే కొద్ది కమలా హారీస్ అధ్యక్షురాలు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, భవిష్యత్తు రాజకీయాల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచీ కమలా హారీస్ అధ్యక్ష్య అభ్యర్ధి అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.ఒక వేళ అదే జరిగితే ఎన్నికల్లో ఆమె అధ్యక్షురాలు అవుతుందని అయితే ఈ విషయంపై ఓ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందట.

ఇప్పుడు ఆ వర్గమే కమలా హారీస్ ప్రాధాన్యత తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తాజాగా అమెరికా మీడియా సంచలన కధనాలు ప్రచురించింది.సదరు వార్తా సంస్థల విశ్లేషణ ఏంటంటే.

కమలా హారీస్ ను బిడెన్ కీలక టీమ్ లోని కొందరు విభేదిస్తున్నారని, ఆమె పేరు చెప్తేనే వారికి నచ్చడం లేదని, దాంతో పరిపాలనా వ్యవహారాల విషయంలో ఆమె పాత్ర తగ్గుతోందని CNN లాంటి వార్తా సంస్థలు బహిరంగంగా వెల్లడించాయి.ఇదిలాఉంటే కమలా కు అత్యంత కీలకమైన టీమ్ గా చెప్పుకునే సైమన్ సాండర్స్, ఆష్లే ఇటైనీ పదవుల నుంచీ తప్పుకోనున్నారట.

కమలా హారీస్ ఎన్నికల్లో విజయం సాధించడానికి, అలాగే ప్రజలలో ఇమేజ్ రావడానికి వీరిద్దరూ ప్రధానంగా తెరవెనుక ఎంతో కృషి చేశారు.అలాంటి వీరిద్దరూ కీలక సమయంలో తప్పుకోవడం వెనుక ఏదో కారణం ఉందని అనుమానం వ్యక్తం చేసింది CNN.రాజకీయంగా కమల హారీస్ ఎదుగకుండా తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని అభిప్రాయపడింది.ఈ విషయాలు కమలా హారీస్ కు తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారట.

Telugu Ashley Etney, Democratic, Kamala Harris, Kamalaharris, Biden, Simon Saunders, White-Telugu NRI

బిడెన్ సైతం ఎంతో సున్నితమైన, కటినమైన వ్యవహారాలు ఆమెకు అప్పగించి తద్వారా ఆమెను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మరొక వార్తా సంస్థ ప్రచురించింది.భవిష్యత్తులో ఆమె అమెరికా అధ్యక్షురాలుగా అవుతుందని, అమెరికాకు మొదటి మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యి రికార్డ్ సృష్టిస్తుందని అనుకుంటున్న తరుణంలో ఆమె ప్రాధాన్యతను మెల్ల మెల్లగా తగ్గించడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి వార్త సంస్థలు.అయితే ఈ పరిణామాలు జరుగుతాయని విశ్లేషకులు.

#KamalaHarris #Biden #Democratic #Kamala Harris #Ashley Etney

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube