మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తక్కువే: వివేక్ మార్తిని ఆకాశానికెత్తిన కమలా హారీస్

అమెరికా సర్జన్ జనరల్, భారత సంతతికి చెందిన వైద్య నిపుణుడు డా.వివేక్ మూర్తిని ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ఆకాశానికెత్తేశారు.

 Kamala Harris Applauds Us Surgeon General Vivek Murthy For Tireless Efforts To Combat Covid 19-TeluguStop.com

కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కమల పాల్గొన్నారు అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

కోవిడ్‌పై పోరులో భాగంగా వివేక్ గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని కమలా హారీస్ అన్నారు.విపత్కర పరిస్ధితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని కాపాడాయని .అటువంటి వ్యక్తికి ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తక్కువేనని ఉపాధ్యక్షురాలు ప్రశంసించారు.

 Kamala Harris Applauds Us Surgeon General Vivek Murthy For Tireless Efforts To Combat Covid 19-మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తక్కువే: వివేక్ మూర్తిని ఆకాశానికెత్తిన కమలా హారీస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి బారిన పడ్డారు.

దీంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది.శుక్రవారం సాయంత్రం వరకు దేశంలో పది కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.ఇందులో రెండు డోసులు తీసుకున్నవారు 5.8 కోట్ల మంది ఉన్నారని యూఎస్ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది.

కాగా, అమెరికా సర్జన్ జనరల్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తిని నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది.అధికారం చేపడూనే వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా నామినేట్ చేశారు బైడెన్.

దీంతో ఈ నియామకానికి సంబంధించి మంగళవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు.దీనిలో భాగంగా 57 మంది సెనేటర్లు వివేక్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయగా, 43 మంది సెనేటర్లు వ్యతిరేకించారు.

రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన ఏడుగురు సెనేటర్లు బిల్ కాసిడీ, సుసాన్ కొలిన్స్, రోజర్ మార్షల్, లిసా ముర్కోవిస్కి, రాబ్ పోర్ట్మన్, మిట్ రోమ్నీ, డాన్ సుల్లివన్ డాక్టర్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయడం విశేషం.

కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా హళెగెరె గ్రామానికి చెందిన వివేక్ మూర్తి కుటుంబానికి తొలి నుంచి రాజకీయాలతో అనుబంధం వుంది.

ఆయన తాత హెచ్‌టీ నారాయణ శెట్టి ఆ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.అంతేకాకుండా కర్ణాటక మాజీ సీఎం దివంగత దేవరాజ్ ఉరుసుకు అత్యంత సన్నిహితుడు.డాక్టర్ వివేక్ మూర్తి తండ్రి డాక్టర్ హెచ్‌ఎన్ లక్ష్మీ నరసింహ మూర్తి.మైసూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు.ఆయన యూకేలో పలు హోదాల్లో పనిచేశారు.వివేక్ సోదరి రష్మి కూడా అమెరికాలోని ఫ్లోరిడాలో ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్నారు.

బ్రిటన్‌లో జన్మించిన వివేక్ మూర్తి అమెరికాలో పెరిగారు.హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.అనంతరం యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఎండీ చేశారు.43 ఏళ్ల డాక్ట‌ర్ మూర్తి .అమెరికా స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్ ప‌ద‌విని చేప‌ట్ట‌డం ఇది రెండ‌వ‌సారి.2011లోనూ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప్ర‌భుత్వ స‌మ‌యంలో వివేక్ మూర్తి .హెల్త్ అడ్వైజ‌ర్‌గా ప‌ని చేశారు.

#SurgeonGeneral #Biden #YaleSchool #Kamala Harris

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు