అమెరికా: ప్రవాస భారతీయులపై చెరగని ముద్ర... పుస్తక రూపంలో కమలా హారిస్ విజయగాథ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల కిందటే అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు.ఈ గడ్డపై ఎన్నో విజయాలు సాధించారు.

 A Book On The Rise Of Indian-americans Inspired By Kamala Harris, Us Vice Presid-TeluguStop.com

రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో కీలక పదవులను పొందడంతో పాటు తమకు ఆశ్రయం కల్పించిన అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇక ఇన్నేళ్లలో భారతీయులు సాధించినది ఒక ఎత్తైతే.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక ప్రవాస చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం.అమెరికా చట్ట సభల్లో శాసనకర్తలుగా, స్థానిక ప్రభుత్వాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు ఏకంగా దేశంలోనే రెండో శక్తివంతమైన పదవిని పొందడం నిజంగా ఒక కొత్త శకానికి ఆరంభం.

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
ఈ నేపథ్యంలో కమలా హారిస్ ఎన్నిక, అగ్రరాజ్యంలో ప్రవాస భారతీయుల వృద్ధి వంటి అంశాలను పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు అక్కడి భారతీయ అమెరికన్ సమాజం, స్కాలర్స్, దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తల బృందం నడుం బిగించింది.

దీనిలో భాగంగా ‘‘ కమలా హారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ’’ అనే సంకలనాన్ని రచించారు.ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్, సంకలన రచయితలలో ఒకరైన ఎంఆర్ రంగస్వామి మాట్లాడుతూ.

కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కథనం, ఇందుకు ఆమె చేసిన పోరాటంతో పాటు భారత సంతతి ప్రజల ఆధిపత్యం వంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లుగా ఆయన వెల్లడించారు.

Telugu Indianamericans, America, Kamala Harris, Indianorigin, Joe Biden, Kamalah

ప్రముఖ భారతీయ సంపాదకుడు తరుణ్ బసు సంకలనం చేసిన 16 వ్యాసాల ద్వారా అమెరికాలో భారతీయ సమాజం పురోగతి వెనుక కథను వివరించారని రంగస్వామి తెలిపారు.ఈ తరహా సంకలనం ప్రచురించడం అమెరికాలో ఇదే మొదటిసారని ఆయన వెల్లడించారు.ఇది హైస్కూల్, యూనివర్సిటీ పాఠ్యాంశాలకు అదనంగా ఉపయోగపడటంతో పాటు మన పిల్లలకు కూడా ప్రవాస భారతీయులు అమెరికాలో అడుగుపెట్టినది మొదలు, సాధించిన విజయాలు ప్రేరణగా నిలుస్తాయని రంగస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

కమలా హారిస్ ప్రస్థానం:

Telugu Indianamericans, America, Kamala Harris, Indianorigin, Joe Biden, Kamalah

కమలా హారిస్‌ 1964 అక్టోబరు 20న కాలిఫోర్నియాలో జన్మించారు.ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్‌, డొనాల్డ్‌ హారిస్‌.చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌ న్యూట్రిషన్‌, ఎండోక్రినాలజీలో పరిశోధన నిమిత్తం అమెరికా వెళ్లారు.యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారీ‌స్‌తో ఆమెకు పరిచయమై ప్రేమగా మారి అది కాస్తా పెళ్లికి దారితీసింది.

కమల తాతయ్య పీవీ గోపాలన్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుడు.చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాతగారి ప్రభావం పడింది.ఆమె 2014లో డగ్లస్‌‌ను పెళ్లి చేసుకున్నారు.

Telugu Indianamericans, America, Kamala Harris, Indianorigin, Joe Biden, Kamalah

1986లో హోవార్డ్‌ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ అందుకున్న కమలా హారిస్.హేస్టింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.అనంతరం రాజకీయాలపై అభిరుచితో డెమోక్రటిక్‌ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు.2003లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికై.ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా రికార్డుల్లోకెక్కారు.2011-17 మధ్య కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు.ఇక 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌ ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube