‘మహానటి’పై ప్రశంసలే కాదు.. విమర్శలు కూడా     2018-05-17   01:45:59  IST  Raghu V

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంపై అన్ని వర్గాల వారు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా భారీ ఎత్తున వసూళ్లు రాబడుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటఱుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ ట్రేడ్‌ వర్గాల వారిని కూడా ఆశ్చర్యంకు గురి చేస్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయం విశ్లేషకులు అంచనా వేస్తున్న సమయంలో మొదటి సారి ఈ చిత్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

జెమిని గణేషన్‌ మొదటి భార్య కుమార్తె అయిన కమలా సెల్వరాజ్‌ ‘మహానటి’పై విమర్శలు చేశారు. మహానటి సావిత్రి గురించి ఈ చిత్రంలో చూపించిన విషయాల్లో చాలా తప్పులున్నాయని, తన తండ్రిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రికి పెళ్లి అయిన విషయం తెలిసి కూడా సావిత్రి ప్రేమాయనం సాగించిందని, పలు సందర్బాల్లో తాను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు సావిత్రి తమ ఇంటికి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అమ్మతో కాస్త దురుసుగా ప్రవర్తించడంతో పాటు నాన్నను ఎప్పుడు దబాయిస్తూ ఉండేదని చెప్పుకొచ్చింది.