ఫొటోటాక్‌ : మాజీ భార్య భర్తల కరచాలనం

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో, యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ మాజీ భార్య సారిక.వీరిద్దరి ప్రేమకు గుర్తుగా శృతిహాసన్‌ మరియు అక్షర హాసన్‌లు ఉన్నారు.

 Kamal Hassan Meet Ex Wife-TeluguStop.com

సారికతో విడిపోయిన తర్వాత కమల్‌ గౌతమితో సహ జీవనం చేస్తున్న విషయం తెల్సిందే.అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? విషయానికి వస్తే మాజీ భార్య భర్తలు ఎదురు పడితే తల తిప్పుకోవడం చేస్తారు.కాని ఇక్కడ కమల్‌, సారికలు అలా కాకుండా నవ్వుతూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుని అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు.

కమల్‌, సారికల చిన్న కూతురు అక్షర హాసన్‌ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం ‘షమితాబ్‌’.

ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

అయితే అక్కడ గౌతమి కూడా ఉంటే బాగుండేదని అక్కడే ఉన్న మీడియా మిత్రులు గుసగుసలాడుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube