మరో సీక్వెల్ లో నటిస్తున్న కమల్!  

Kamal In Another Sequel-

ఇటీవల పాత సినిమా లకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సీక్వెల్ సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘క్షత్రియ పుత్రుడు’ ఒకటి. అయితే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని చూస్తున్నారు..

మరో సీక్వెల్ లో నటిస్తున్న కమల్! -Kamal In Another Sequel

అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఏకంగా కమలే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. 1992లో తమిళనాట విడుదలైన ‘దేవర్ మగన్’ సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’ పేరుతోను భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన కమల్, అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. తొలి షెడ్యూల్ ను పొల్లాచ్చి లో ఆరంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికే ‘భారతీయుడు 2’ చేస్తున్న కమల్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన కారణంగా ఈ కారణం తీసుకున్నట్లు సినీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త లో ఎంత నిజం ఉంది అనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు. అయితే దీనిపై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.