విక్రమ్ 300 కోట్లు కొట్టేలా ఉన్నాడు..!

కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా విక్రం.జూన్ 3న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 Kamal Hassan Vikram Movie Will Reach 300 Crores Target Details, Fahadh Faazil, K-TeluguStop.com

తమిళంతో పాటుగా తెలుగులో కూడా విక్రం సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.తెలుగులో ఈ సినిమాను సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు.9 రోజుల్లో విక్రం సినిమా 241.11 కోట్ల గ్రాస్, 136.30 కోట్ల షేర్ రాబట్టింది.తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 కోట్ల బిజినెస్ చేయగా 9 రోజుల్లో సినిమా 22.11 కోట్ల గ్రాస్ అంటే 12.53 కోట్ల షేర్ రాబట్టింది.

కమల్ హాసన్ ఈ రేంజ్ హిట్ కొట్టి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పొచ్చు.సరైన కథ.సరైన కథనంతో లోకేష్ కనగరాజ్ విక్రం సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.

సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.ఇప్పటికే 250 కోట్లకు దగ్గరగా ఉన్న విక్రం కలక్షన్స్ చూస్తుంటే 300 కోట్లు దాటేలా ఉన్నాయని చెప్పొచ్చు.

విక్రం సినిమాతో కమల్ హాసన్ మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా ఆయనకు మరింత జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube