తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో నటించి శ్రీదేవి నటిగా పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి తన ప్రతిభతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
కన్దన్ కరుణై అనే తమిళ మూవీతో నటిగా శ్రీదేవి కెరీర్ ను మొదలుపెట్టారు.కెరీర్ తొలినాళ్లలో తమిళ, మలయళ సినిమాలలో ఆమె ఎక్కువగా నటించడం గమనార్హం.
కమల్ హాసన్, శ్రీదేవి కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు వచ్చాయనే సంగతి తెలిసిందే.ఈ జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.వసంత కోకిల, ఆకలి రాజ్యం, ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాలు కమల్, శ్రీదేవిలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.బాలీవుడ్ లో కూడా ఈ జోడీ కలిసి నటించడం గమనార్హం.
శ్రీదేవితో కమల్ హాసన్ సన్నిహితంగా మెలగడంతో శ్రీదేవి తల్లి కమల్ హాసన్ ను శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని కోరారు.
అయితే కమల్ హాసన్ మాత్రం శ్రీదేవి తల్లి చేసిన ప్రపోజల్ కు సున్నితంగా నో చెప్పారు.
శ్రీదేవిని తాను సిస్టర్ లా భావించేవాడినని అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని తాను అనుకోలేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.సినిమాలలో తనకు, శ్రీదేవికి లవ్ సీన్స్ ఉన్నాయని అయితే రియల్ లైఫ్ లో మాత్రం తమ మధ్య బ్రదర్ సిస్టర్ అనుబంధం మాత్రమే ఉండేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
తనను శ్రీదేవి సార్ అని పిలిచేవారని కమల్ హాసన్ పేర్కొన్నారు.శ్రీదేవికి తాను అంటే ఎంతో గౌరవమని కమల్ తెలిపారు.ఇప్పటికీ శ్రీదేవి, కమల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.2018 సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీన శ్రీదేవి ప్రమాదవశాత్తూ మరణించారు.