పోలింగ్ అయిన నెక్స్ట్ డే షూటింగ్ లో జాయిన్ అయిన కమల్ హసన్

యూనివర్శల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న విలక్షణ నటుడు కమల్ హసన్.కోలీవుడ్ నటుడైన కమల్ హసన్ బ్రాండ్ ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఉంది.

 Kamal Hassan Joins Vikram Movie Shooting-TeluguStop.com

అతని యాక్టింగ్ టాలెంట్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇదిలా ఉంటే కమల్ హసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.అయితే లాక్ డౌన్, తరువాత తమిళనాడు రాజకీయాల కారణంగా వాయిదా పాడింది.

 Kamal Hassan Joins Vikram Movie Shooting-పోలింగ్ అయిన నెక్స్ట్ డే షూటింగ్ లో జాయిన్ అయిన కమల్ హసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికలలో కమల్ హసన్ పోటీ చేయడంతో ఎన్నికలు ముగిసే వరకు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

ఇక పోలింగ్ ముగిసిన మరుసటి రోజే కమల్ హసన్ షూటింగ్ లో జాయిన్ కావడం విశేషం.ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే మాస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ కమల్ హసన్ తో విక్రమ్ సినిమా స్టార్ట్ చేశారు.ఈ సినిమా టీజర్ కమల్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాదిలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

టీజర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.సోషల్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని లోకేష్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫైజల్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తూ ఉండటం విశేషం.ఇప్పటికే అతను కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

#Kollywood #Kamal Hassan #Fahadh Faasil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు