ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోకనాయకుడు... ఊపిరిపీల్చుకున్న అభిమానులు!

సాధారణంగా సినీ అభిమానులు హాస్పిటల్ వెళ్ళారంటే అభిమానులు ఎంతో ఆందోళన చెందుతారు.తమ అభిమాన నటుడికి ఏమైంది ఎందుకు వెళ్లారు అంటూ ఎంతో కంగారు పడతారు.

 Kamal Hassan Discharged From Hospita -fans Are Feeling Happy Kamal Hassan, Tollywood, Discharged, Hospital , Fans, Kollywood-TeluguStop.com

అయితే ఈ క్రమంలోనే కరోనా బారిన పడి కోలుకున్న విలక్షణ నటుడు, కమల్ హాసన్ సోమవారం ఆస్పత్రికి వెళ్లడంతో మరోసారి అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.కరోనా నుంచి కోలుకుని ఎంతో ఆరోగ్యంగా ఉంటూ షూటింగులతో బిజీగా ఉన్న కమల్ హాసన్ ఇలా ఉన్న పళంగా ఆస్పత్రికి వెళ్లడం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీశారు.

ఈ క్రమంలోనే సోమవారం కమల్ హాసన్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు అనే ఈ విషయంపై కమల్ హాసన్ టీమ్ వివరణ ఇచ్చారు.కమల్ హాసన్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారని,ఈ క్రమంలోనే వైద్యులు అతనికి అన్ని రకాల పరీక్షలు చేయడంతో ఒక రోజు పాటు ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు.

 Kamal Hassan Discharged From Hospita -fans Are Feeling Happy Kamal Hassan, Tollywood, Discharged, Hospital , Fans, Kollywood-ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోకనాయకుడు#8230; ఊపిరిపీల్చుకున్న అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Discharged, Fans, Kamal Hassan, Kollywood, Tollywood-Movie

అయితే ఆయన రిపోర్ట్ రావడంతో వైద్యులు తనకు ఏ విధమైనటువంటి సమస్య లేదని చెప్పడంతో కమల్ హాసన్ ఇంటికి వెళ్లారని ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని తెలియజేశారు.ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే…”విక్రమ్”, “ఇండియన్-2” సినిమాలలో నటించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube