వేదికపై నుంచి వేలు చూపిస్తూ అభిమాని పై సీరియస్ అయిన కమల్.. కారణం అదేనా?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఈ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరడంతో కమల్ హాసన్ ఎంతో సంతోషంలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఈ సినిమాతో మంచి లాభాలు వచ్చాయని తనకున్న అప్పులు మొత్తం తీర్చి తనకి ఇష్టమైన ఆహారం తింటూ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.ఇకపోతే ఈయన సినిమాల పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తన రాజకీయ పార్టీ తరఫున కమల్ హాసన్ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరంలో భాగంగా ఏకంగా నాలుగు లక్షల లీటర్ల రక్తాన్ని ఉచితంగా దానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇకపోతే రక్తదాన కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు అభిమానులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై పార్టీ నేత మాట్లాడుతూ ఉండగా ఒక అభిమాని విక్రమ్ అంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు.

Advertisement

ఈ విధంగా ఆ అభిమాని కేకలు వేయడంతో వేదికపై ఉన్న కమల్ హాసన్ అభిమానికి వేలు చూపిస్తూ అరవద్దూ అంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇలా కమల్ హాసన్ వేదికపై అభిమాని పట్ల ఎందుకు కోపం వ్యక్తం చేశారో అనంతరం తెలియజేశారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ప్రజల కోసం నాలుగు లక్షల లీటర్ల రక్తదానం చేస్తున్నాము.ఇదే నాలుగు లక్షల లీటర్ల రక్తాన్ని అమ్మితే ఏకంగా కోట్ల రూపాయల లాభాలను పొందవచ్చు.

కానీ ప్రజల కోసం మనం ఉచితంగా రక్తదానం చేస్తున్నాము.అయితే విక్రం అనే పదానికి తమిళంలో అమ్మటం అని అర్థం వస్తుంది.

రక్తదానం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇలా విక్రమ్ అంటూ గట్టిగా అరవడంతో ప్రజలు రక్త దానాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అందుకే తాను అరవద్దని చెప్పినట్లు కమల్ హాసన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు