తమిళ బిగ్‌ బాస్‌ కూడా వచ్చేస్తున్నాడు

కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని భాషల బిగ్‌ బాస్ లు కూడా ఆగిపోయే అవకాశం ఉందని భావించారు.కాని కాస్త ఆలస్యంగా బిగ్‌ బాస్‌ అన్ని భాషల్లో కూడా ప్రారంభం కాబోతుంది.

 Kamal Hassan Tamil Bigg Boss 4 Announcement , Kamal Hasan, Nagarjuna, Tamil Big-TeluguStop.com

మొదటగా తెలుగులో సీజన్‌ 4 ప్రారంభం కాబోతుండగా హిందీలో కొత్త సీజన్‌ కు ఇప్పటికే ప్రోమో వచ్చేసింది.అయితే ఈసారి తమిళ బిగ్‌ బాస్‌ ఉండదేమో అని, కమల్‌ ఇందుకు ఒప్పుకోక పోవచ్చు అని అంతా అనుకున్నారు.

కాని కమల్‌ కూడా రెడీ అయినట్లుగా ప్రకటించాడు.తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ను సెప్టెంబర్‌ 6 నుండి ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన వచ్చిన కొద్ది సమయంకే కమల్‌ కూడా తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ను ప్రకటించాడు.

ఈ విపత్కర పరిస్థతుల్లో ప్రతి ఒక్కు జాగ్రత్తగా ఉండటంతో పాటు అంతా చాలా హుందాగా వ్యవహరించారు అంటూ సుదీర్ఘమైన ఒక స్పీచ్‌ ఇచ్చి చివర్లో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు సంబంధించిన ప్రకటన చేశాడు.ఈ ప్రకటతో తమిళ ఆడియన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది.ఇప్పటికే తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కోసం కంటెస్టెంట్స్‌ ను ఎంపిక చేయడం జరిగింది.

ఆ విషయంలో కమల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సెప్టెంబర్‌ చివరి వారం నుండి షో షురూ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube