'విక్రమ్' సినిమాతో కమల్ ఆ సెన్సేషన్ మార్క్ టచ్ చేస్తాడా?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.

 Kamal Haasan's Vikram Will Be Touch This Magic Figure, Kamal Haasan, Vikram Movi-TeluguStop.com

అందుకే ఈయనకు ఒక హిట్ చాలా అవసరం అయ్యింది.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు కమల్.

ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈయనకు హిట్ వచ్చినా చాలు అనుకుంటే విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.

వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.

Telugu Fahadh Fasil, Kamal Haasan, Kamalhaasans, Vikram-Movie

జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో సూపర్ హిట్ మూవీగా నిలిచింది.సొంత బ్యానర్ లో కమల్ ఈ సినిమాను నిర్మించారు.

దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.అందుకే కమల్ చాలా సంతోషంగా ఉన్నాడు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్న ఇంకా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.

అలాగే ఇన్ని రోజు అవుతున్న ఇంకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు మాత్రం ఆగడం లేదు.

ఈ సినిమా హిందీ వసూళ్లు లేకుండానే ఇప్పటికే 380 కోట్ల గ్రాస్ అందుకుంది.ఇక ఇప్పుడు 400 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం కూడా ఏమంత కష్టం కాదు అని ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు.

మరి విక్రమ్ కనుక 400 కోట్ల మార్క్ అందుకుంటే సెన్సేషన్ అనే చెప్పాలి.విక్రమ్ దూకుడు తగ్గుతుందో లేదంటే ఇంకా అలానే కొనసాగి 400 కోట్ల మార్క్ అందుకుంటాడో అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube