ఇండియన్ 2 కోసం లోకనాయకుడు అంత పుచ్చుకుంటున్నాడా.. ఇది రికార్డే!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఇప్పటికి క్రేజ్ ఉంది.

 Kamal Haasan's Remuneration For Indian 2, Kamal Haasan, Director Shankar , Kamal-TeluguStop.com

ఎందుకంటే ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు కాబట్టి ఈయన సినిమాలకు స్పెషల్ డిమాండ్ ఉంటుంది.

అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.కానీ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన విజయంతో మరింత జోష్ లో తన తదుపరి సినిమాలు చేస్తున్నాడు.అలాగే లాక్ డౌన్ ముందు ఆగిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు రీస్టార్ట్ చేసారు.

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నాడు శంకర్.తాజాగా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.ఈ సినిమాకు లోకనాయకుడు భారీ పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అయ్యింది.

కోలీవుడ్ మీడియా చెబుతున్న ప్రకారం.ఈ సినిమాకు కమల్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అని అంటున్నారు.

మరి ఒక్క సినిమాకు ఇంత రెమ్యునరేషన్ అంటే భారీ మొత్తం అనే చెప్పాలి.

Telugu Shankar, Indian, Kamal Haasan, Kamalhaasans, Kamal Hasan-Movie

ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.చూస్తుంటే ఈ సినిమా మరో ఎపిక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube