రివెంజ్ ఫార్ములాతో మ్యాజిక్ చేసిన కమల్ హాసన్.. సినిమా సూపర్ హిట్టు?

ఒక సినిమాలో ఉండే ఒకే రకమైన ఫైట్లు, డాన్సులు అనేవి మరో సినిమాలో ఉంటే ప్రేక్షకులను ఆ సినిమా మెప్పించలేకపోతుంది.ఎందుకంటే ఆ సన్నివేశాలన్నీ చూస్తే ఇదివరకే చూసినటువంటి ఫీలింగ్ ఉండటంతో సినిమా కొత్తది అయినా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది.

 Kamal Hasan With Revenge Formula Movie But Movie Is Super Hit Details, Kamal Ha-TeluguStop.com

దాంతో కొందరి దర్శకులకు, హీరోలకు ఇటువంటి అనుభవాలు ఎదురవడంతో అప్పటి నుండి చాలా జాగ్రత్త పడుతున్నారు.

తాము తీసుకునే కథలను ఇదివరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటారు.

అంటే ఆ కథకు ఇంతకు ముందు తీసిన కథ ఒకేలా ఉన్నట్లు అనిపిస్తే దాన్నే కాస్త కొత్తరకంగా మారుస్తూ ఉంటారు.అలా ఇప్పటికి ఎన్నో సినిమాల్లో  మార్పులు చేయగా అలా చాలావరకు మంచి సక్సెస్ లను అందుకున్నాయి.

అలా గతంలో ఓ సినిమా రూపొందగా ఆ సినిమా ఇప్పటికీ ఎంతో ఆదరణలో ఉందని చెప్పవచ్చు.ఇంతకు అదేం  సినిమానో తెలుసుకుందాం.

డైరెక్టర్ భారతీరాజా తన దర్శకత్వంలో టాప్ టక్కర్ అనే సినిమాను రూపొందించాడు.ఈ సినిమాలో కమల్ హాసన్ నటించాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ సగభాగం పూర్తయ్యాక అందులో తన దర్శకత్వంలో ఇదివరకు తెరకెక్కిన ఎర్రగులాబీలు స్టైల్ ఉందని గుర్తించారు.దాంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు.

Telugu Aakri Rastha, Bharathi Raju, Kamal Haasan, Marana Homam, Orukhaidiyan, Ra

దీంతో అదే సమయంలో దర్శకుడు భాగ్యరాజు చెప్పిన కథ కమల్ హాసన్ కు నచ్చింది.అందులో గెటప్ పరంగా కమల్ హాసన్ ప్రతి ఒక్క సాహసానికి సిద్ధపడ్డాడు.దీంతో భాగ్యరాజు తండ్రి కొడుకులుగా పాత్ర ఉంటుందని చెప్పటంతో వెంటనే ఒప్పుకున్నాడు కమల్ హాసన్.ఇందులో ఇళయరాజా సంగీత దర్శకుడిగా బాధ్యతలు చేపట్టాడు.

రేవతి, రాధా హీరోయిన్ లు ఇద్దరు నటించారు.ఇందులో కమలహాసన్ రెండు పాత్రలలో నటించగా అందులో రాజకీయ నాయకుడికి అనుచరుడిగా డేవిడ్ పాత్రలో నటించాడు.

ఇక ఆయన భార్య పాత్రలో రాధా నటించింది.అలా తన భార్య ప్రాణాలు పోవటం తో.ఆ నేరం తనపై పడుతుంది.అలా అతడు 22 ఏళ్లు జైల్లో ఉండి బయటకు వస్తాడు.

Telugu Aakri Rastha, Bharathi Raju, Kamal Haasan, Marana Homam, Orukhaidiyan, Ra

తన కొడుకు గా కమల్ హాసన్  కొడుకు పాత్రలో నటించగా.ఆ కొడుకును జనక్ రాజ్ పెంచి పెద్ద పోలీస్ ఆఫీసర్ గా చేస్తాడు.దీంతో డేవిడ్ తనను ఈ పరిస్థితి తీసుకు వచ్చిన వాళ్ల ప్రతీకారం తీర్చుకునేందుకు తన స్వంత బిడ్డ అని తెలియకుండా అతడిని పట్టుకోడానికి రంగంలోకి దిగుతాడు.

అలా ఈ సినిమా చివరి వరకు ట్విస్ట్ ల మీద ట్విస్టులతో అదిరిపోయే క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది.

ఇక ఈ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచింది.దీంతో ఈ సినిమాను తమిళంలో ‘ఓరు ఖైదీయన్ డైరీ’ టైటిల్ తో 1985 లో విడుదల చేయగా మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Aakri Rastha, Bharathi Raju, Kamal Haasan, Marana Homam, Orukhaidiyan, Ra

ఇక హిందీలో ‘ఆఖరీ రాస్తా’ అనే టైటిల్ తో విడుదల కాగా అక్కడ కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలోని కథను అటుఇటుగా మారుస్తూ కోదండరామి రెడ్డి తన దర్శకత్వంలో ‘మారణహోమం’ అనే పేరుతో తెరకెక్కించాడు.కానీ ఈ సినిమా అసలు సక్సెస్ కాలేకపోయింది.అలా ఒకటే కథను మార్పులు లేకుండా తిప్పితిప్పి విడుదల చేస్తే మాత్రం పక్కా బోల్తా కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube