వరల్డ్ వైడ్ గా 5 వేల థియేటర్ లలో 'విక్రమ్' రిలీజ్.. ఈసారి హిట్ పక్కానా..

యూనివర్సల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు కమల్ హాసన్. ఈయన తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు.

 Kamal Haasan Vikram To Release On 5000 Screens Details, Vikram, Universal Star Kamal Hassan, Director Lokesh Kanka Raju, Fahad Faisal, Vijay Sethupathi, Kamal Hasan Vikram Movie, Vikram Pre Release Business-TeluguStop.com

అయితే ఈయన హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.అయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించాక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

 Kamal Haasan Vikram To Release On 5000 Screens Details, Vikram, Universal Star Kamal Hassan, Director Lokesh Kanka Raju, Fahad Faisal, Vijay Sethupathi, Kamal Hasan Vikram Movie, Vikram Pre Release Business-వరల్డ్ వైడ్ గా 5 వేల థియేటర్ లలో విక్రమ్#8217; రిలీజ్.. ఈసారి హిట్ పక్కానా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.ఈయన కూడా తన సినిమాలను విభిన్నంగా తెరకెక్కిస్తుంటాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించిన అప్డేట్ ఒకటి వచ్చింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్క్రీన్ లలో రిలీజ్ అవుతుందట.అన్ని భాషల్లో అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 5000 వేల కి పైగానే స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇంత భారీ నెంబర్ ఆఫ్ స్క్రీన్ లలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.మరి కమల్ చాలా కాలం తర్వాత వస్తున్న విక్రమ్ తో అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube