విశ్వ నటుడు కమల్ హాసన్ ఇండియా 2 సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.ఆ సినిమాని వేగంగా కంప్లీట్ చేసి తన పొలిటికల్ కెరియర్ కి ప్లస్ అయ్యేలా చేసుకోవాలని భావించారు.
అయితే అది సెట్ కాలేదు.ఓ వైపు కరోనా మహమ్మారి సినిమాని ఆపేస్తే మరో వైపు నిర్మాతలు సైలెంట్ అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపధ్యంలో యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని కూడా కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
ఈ టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దర్శకుడు చెప్పేశాడు.ఇక ఈ సినిమాకి విక్రమ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.
ఇందులో కమల్ హాసన్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపధ్యంలో త్వరలో స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా షూటింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారు.సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ లో 50 రోజుల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
అలా చేయగలిగితే మరల ఎన్నికల నాటికి తన రాజకీయ కార్యక్రమాలలో బిజీ కావడానికి అవకాశం దొరుకుతుంది.కమల్ కూడా ఇదే విషయాన్ని దర్శకుడుకి చెప్పి 50 రోజులు డేట్స్ మాత్రమే ఇస్తానని చెప్పినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో విజయ్ తో చేసిన మాస్టర్ సినిమా రిలీజ్ కాకుండానే లోకేష్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాడు.ఈ నెలాఖరులో లేదంటే డిసెంబర్ మొదటి వారం నుంచి విక్రమ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.