తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్న కమల్ హసన్... ఆ ప్లేస్ లోకి యంగ్ హీరో

బిగ్ బాస్ రియాలిటీ షో ఇండియన్ వైడ్ గా ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక బిగ్ బాస్ హిందీలో ఇప్పటికే 10 సీజన్స్ దాటిపోయాయి.

 Kamal Haasan To Quit Bigg Boss, Bigg Boss Seasion 5, Tollywood, Kollywood, King-TeluguStop.com

తెలుగులో నాలుగో సీజన్ నడుస్తుంది.ఈ నాలుగు సీజన్స్ కి ముగ్గురు హోస్ట్ లు మారారు.

ప్రస్తుతం తెలుగులో కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.నెక్స్ట్ సీజన్ కి ఎవరుంటారు అనేది ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.

ఇదిలా ఉంటే తమిళ్ లో బిగ్ బాస్ సీజన్ నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.ఈ నాలుగు సీజన్స్ కి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు.

ఈ ఏడాది ఐదో సీజన్ స్టార్ట్ చేయడానికి నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు.ఇంతలో ఊహించని విధంగా తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తుంది.

తమిళనాట బిగ్ బాస్ షోకి విమరీతమైన వ్యతిరేకత వస్తుంది.ప్రతి సీజన్ లో తమిళ్ ప్రజల నుంచి బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు నిరసనలు చేస్తున్నాయి.

అయినా కూడా కమల్ హాసన్ నాలుగు సీజన్స్ పాటు ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించారు.అయితే రీసెంట్ గా కమల్ కి తమిళనాడు స్టేట్ పోలిటిక్స్ లో కూడా ఎదురుదెబ్బ తగిలింది.

పోటీ చేసిన అన్ని స్థానాలలో కమల్ హాసన్ పార్టీ ఓడిపోయింది.లోకనాయకుడుగా స్టార్ హీరోగా విశేషమైన గుర్తింపు ఉన్న కమల్ హాసన్ కూడా స్థానిక బీజేపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయారు.

దీంతో ప్రస్తుతం రాజకీయాలకి విరామం ఇచ్చి సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.బిగ్ బాస్ కూడా రాజకీయంగా తన ఓటమికి ఒక కారణం అని భావించి హోస్ట్ గా కమల్ హసన్ తప్పుకుంటున్నట్లు తమిళనాట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అలాగే ఒక యువ హీరోని ఈ సారి హోస్ట్ గా ఖరారు చేసినట్లు కూడా టాక్ నడుస్తుంది.మరి దీనిలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే నిర్వాహకులు స్పందించే వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube