ఇండియన్ 2 బాద్యత తీసుకుంటున్న కమల్ హసన్

విశ్వ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికలలో ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలలో కొంత కాలం ఉండకపోవచ్చు.ఈ నేపధ్యంలో ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విక్రమ్ షూటింగ్ లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే జాయిన్ అయ్యాడని టాక్.

 Kamal Haasan Take Indian 2 Responsibility-TeluguStop.com

తమిళనాడులో లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే కరోనా సిచువేషన్స్ మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె అవకాశం ఉంది.

ఇదిలా ఇండియన్ 2 సినిమా చాలా కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది.ఇప్పటికే సినిమాకి 180 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు.

 Kamal Haasan Take Indian 2 Responsibility-ఇండియన్ 2 బాధ్యత తీసుకుంటున్న కమల్ హాసన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నిర్మాత, దర్శకుడు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ముందుకి కదలడం లేదు.ఇక ఈ విషయంపై ఇద్దరు కోర్టు వరకు వెళ్ళడంతో ఇండియన్ 2 వివాదం జడ్జ్ ముందు ఉంది.

అయితే కమల్ హసన్ కి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలలో ఇండియన్ ఒకటి అనే విషయం అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 ఆగిపోతే ఆ బ్యాడ్ రిమార్క్ కమల్ హసన్ మీద కూడా పడుతుంది.

ఈ నేపధ్యంలో మరోసారి నిర్మాత, దర్శకుడు మధ్య మధ్యవర్తి చేసి ఆ సినిమా కంప్లీట్ అయ్యేలా తాను భాద్యత తీసుకోవాలని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇండియన్ 2 సినిమా విషయంలో ఫాన్స్ నుంచి కూడా ఒత్తిడి వస్తూ ఉండటంతో ఎట్టి పరిస్థితిలో సినిమా కంప్లీట్ చేపించెందుకు కమల్ హసన్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

దీంతో పాటు ఇకపై బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే కొంత మంది యువ దర్శకుల కథలు కూడా కమల్ హసన్ వింటున్నారని సమాచారం.

#Indian 2 #Kamal Haasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు